నెలకు ఒక్కరోజు జీతం.. విరాళం
దిశ, న్యూస్‌బ్యూరో: దేశవ్యాప్తంగా కరోనా నివారణ చర్యలు చేపడుతున్న నేపథ్యంలో నిధుల కోసం ప్రభుత్వాలు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రాల్లో నెలలో ఒక రోజు జీతాన్ని లేదా హోదాను బట్టి జీతంలో కొంతమేర కోత విధించేందుకు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయి. తాజాగా కేంద్ర ఆర్థికశాఖ తన పరిధిలోని అధికారులను, సిబ్బందిని 2021 మార్చి వరకూ ప్రతీ నెలా జీతంలో ఒక రోజు వేతనాన్ని ప్రధాన మంత్రి సహాయనిధికి జమ చేయాల్సిందిగా సూచించింది. ఇప్పుడు కేంద్ర ఆర్థిక […]
దిశ, న్యూస్‌బ్యూరో: దేశవ్యాప్తంగా కరోనా నివారణ చర్యలు చేపడుతున్న నేపథ్యంలో నిధుల కోసం ప్రభుత్వాలు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రాల్లో నెలలో ఒక రోజు జీతాన్ని లేదా హోదాను బట్టి జీతంలో కొంతమేర కోత విధించేందుకు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయి. తాజాగా కేంద్ర ఆర్థికశాఖ తన పరిధిలోని అధికారులను, సిబ్బందిని 2021 మార్చి వరకూ ప్రతీ నెలా జీతంలో ఒక రోజు వేతనాన్ని ప్రధాన మంత్రి సహాయనిధికి జమ చేయాల్సిందిగా సూచించింది. ఇప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో శాఖ పరిధిలోని అందరూ ఏడాదిలో 12 రోజుల జీతాన్ని ఈ సహాయ నిధి కోసం ఇవ్వాలి.
tags: Union Finance Department, PM Relief Fund, 12 days salary, March 2021, donation