అయ్యప్ప, మెహర్ బాబా ఆలయాల్లో చోరీ..
దిశ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో దొంగలు కలకలం సృష్టించారు. జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో గల మూడు ఆలయాల హుండీల్లో రెండు హుండీల సొత్తును ఎత్తుకెళ్లారు. ఆలయంలోని శివాలయం, హనుమాన్ ఆలయాల హుండీలను గుణపంతో పగులగొట్టి వాటిలో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు. చోరీ జరిగిన తీరు ఆలయంలో గల సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయింది. ఆలయ ప్రధాన గేటు పక్కన గల చిన్న గేటు తాళం పగులగొట్టి నలుగురు దుండగులు ఆలయంలోకి చొరబడ్డారు. ముగ్గురు […]
దిశ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో దొంగలు కలకలం సృష్టించారు. జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో గల మూడు ఆలయాల హుండీల్లో రెండు హుండీల సొత్తును ఎత్తుకెళ్లారు. ఆలయంలోని శివాలయం, హనుమాన్ ఆలయాల హుండీలను గుణపంతో పగులగొట్టి వాటిలో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు. చోరీ జరిగిన తీరు ఆలయంలో గల సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయింది. ఆలయ ప్రధాన గేటు పక్కన గల చిన్న గేటు తాళం పగులగొట్టి నలుగురు దుండగులు ఆలయంలోకి చొరబడ్డారు. ముగ్గురు చోరీకి ప్రయత్నించగా ఒకరు బయట కాపలాగా ఉన్నట్టు తెలుస్తోంది. రెండు హుండీలను పగులగొట్టి మూడవ హుండీ చోరీకి యత్నించే సమయంలో శబ్దం వచ్చి ఆలయ వాచ్ మెన్ అప్రమత్తమయ్యారు. వెంటనే ఆలయ కమిటీ చైర్మన్ కు సమాచారం అందించగా పోలీసులకు వివరాలు అందజేశారు. పోలీసులు వచ్చి చోరీ జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరిస్తున్నారు. అయ్యప్ప అలయంతో పాటు పక్కనే ఉన్న మెహర్ బాబా ఆలయంలో సైతం హుండీని దుండగులు ఎత్తుకెళ్లారు. మొత్తం 15 వేలకు పైగా చోరీ జరిగినట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.