నేలకేసి కొట్టినా పగలని కోడి గుడ్డు.. షాక్‌లో గ్రామస్థులు
దిశ, వెబ్‌డెస్క్ : కోడిగుడ్లు తింటే చాలా బలం అంటారు. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే ఈ కోడిగుడ్లను సరిగా పట్టుకో లేకుంటే పగిలిపోతాయని అమ్మవాళ్లు జాగ్రత్తలు చెప్పుతారు. వాటిని షాప్ నుంచి తెచ్చేటప్పటి నుంచి వండే వరకు ఎంతో భద్రంగా కాపాడుకుంటాము… కానీ కిందపడితే పగలని కోడిగుడ్లు కూడా దొరుకుతున్నాయంట మార్కెట్లలో. కోడిగుడ్డు అంటే పగులుతుంది, పగలని కోడి గుడ్డు ఉండడమేంటి అనేగా మీ ఆలోచన. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం అండ్రవారిపల్లిలో […]
దిశ, వెబ్‌డెస్క్ : కోడిగుడ్లు తింటే చాలా బలం అంటారు. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే ఈ కోడిగుడ్లను సరిగా పట్టుకో లేకుంటే పగిలిపోతాయని అమ్మవాళ్లు జాగ్రత్తలు చెప్పుతారు. వాటిని షాప్ నుంచి తెచ్చేటప్పటి నుంచి వండే వరకు ఎంతో భద్రంగా కాపాడుకుంటాము… కానీ కిందపడితే పగలని కోడిగుడ్లు కూడా దొరుకుతున్నాయంట మార్కెట్లలో. కోడిగుడ్డు అంటే పగులుతుంది, పగలని కోడి గుడ్డు ఉండడమేంటి అనేగా మీ ఆలోచన.
నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం అండ్రవారిపల్లిలో ఆటోలో కోడిగుడ్లు తెచ్చి విక్రయించారు గుర్తు తెలియని వ్యక్తులు. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో కోడి గుడ్డుకు ధర బాగానే ఉంది. కానీ, ఆటోలో కోడిగుడ్ల తెచ్చిన అతను తక్కువ ధరకు వాటిని విక్రయించడంతో.. తక్కువధరకు వస్తున్నాయన్న సంతోషంతో చాలా మంది కొనుగోలు చేశారు. వాటిని ఉడకబెట్టిన తర్వాత గుడ్లు నల్లగా మారడంతో కొన్నవారు విస్తుపోయారు. మిగితా కోడిగుడ్లను తీసి నేలకేసి కొట్టినా అవి పగలలేదు. దీంతో షాకైన వారు అవి ప్లాస్టిక్ కోడి గుడ్లగా గ్రహించారు. మాములుగా అయితే మార్కెట్లో ఆరు రూపాయలు చేసే గుడ్డు ఒక అట్ట అంటే, దాదాపు 30కోడి గుడ్లు, 30కోడిగుడ్ల ధర 180రూపాయలు వరకు ఉంటుంది. 80రూపాయలు తగ్గించి విక్రయించారు అంటే మూడున్నర రూపాయలు కూడా అవ్వలేదు. ఎంత తగ్గించి అమ్మినా కూడా ఇంత తక్కువకు ఎలా అమ్ముతారు అని ఎవరూ ఆలోచించలేదు, దీంతో అందరూ మోసపోయారు.