తెలియకుండానే.. ఖాతాలోకి 30 కోట్లు

             కర్ణాటకలో పూల వ్యాపారం చేసుకుని జీవిస్తున్న ఓ మహిళ జన్‌ధన్ ఖాతాలో గుర్తు తెలియని వ్యక్తులు సుమారు రూ. 30 కోట్లు జమ చేశారు. దీంతో బ్యాలెన్స్ రూ. 60 నుంచి ఏకంగా కోట్లకు చేరింది. దీని గురించి ఆరా తీసినా.. బ్యాంకు అధికారులు తగిన విధంగా స్పందించకపోవడంతో.. తమ ఖాతాతో ఏదో మోసం జరుగుతున్నదని అనుమానించిన సదరు దంపతులు ఐటీ అధికారులను ఆశ్రయించారు. కర్ణాటకలోని రామనగర్ జిల్లా […]

Update: 2020-02-05 06:27 GMT

ర్ణాటకలో పూల వ్యాపారం చేసుకుని జీవిస్తున్న ఓ మహిళ జన్‌ధన్ ఖాతాలో గుర్తు తెలియని వ్యక్తులు సుమారు రూ. 30 కోట్లు జమ చేశారు. దీంతో బ్యాలెన్స్ రూ. 60 నుంచి ఏకంగా కోట్లకు చేరింది. దీని గురించి ఆరా తీసినా.. బ్యాంకు అధికారులు తగిన విధంగా స్పందించకపోవడంతో.. తమ ఖాతాతో ఏదో మోసం జరుగుతున్నదని అనుమానించిన సదరు దంపతులు ఐటీ అధికారులను ఆశ్రయించారు. కర్ణాటకలోని రామనగర్ జిల్లా చెన్నపట్టణ బిడి కాలనీలో రెహానా బానో, సయ్యద్ మల్లిక్‌లు నివాసముంటున్నారు. భార్య రెహానా బానో పేరిట 2015లో ఓపెన్ చేసిన జన్‌ధన్ ఖాతాలో కోట్ల రూపాయలు జమ అయ్యాయని, కానీ, బ్యాంకు ఖాతాను ఆధార్‌తో లింక్ చేయలేదని బ్యాంకు అధికారులు.. సయ్యద్ మల్లిక్‌కు గత డిసెంబర్‌లో ఫోన్ చేశారు. ఆశ్చర్యపోయిన మల్లిక్ ఏటీఎం వెళ్లి స్టేట్‌మెంట్ తీసుకున్నాడు. అంతే.. ఖాతాలో దాదాపు రూ. 30కోట్లున్నట్టు చూపించడంతో నిర్ఘాంతపోయాడు. బ్యాంకు వెళ్లి వివరాలడగ్గా.. అధికారులు నిరాకరించారు. పాస్‌బుక్‌నూ ప్రింట్ చేయలేదని, ఇతర వివరాలూ వెల్లడించకపోవడంతో ఐటీ అధికారులను ఆశ్రయించినట్టు మల్లిక్ తెలిపారు. చీర కొన్నందుకు లాటరీ తగిలిందని గతంలో ఓ ఫోన్ వచ్చిందని చెప్పాడు. అయితే, వారికి ఖాతా వివరాలిచ్చినా.. మళ్లీ ఫోన్ రాలేదని గుర్తుచేసుకున్నారు. ఈ ఫోన్ తర్వాతే ఖాతాలోకి నగదు చేరిందని, వారికి తెలియకుండా పలు లావాదేవీలూ జరిగాయని అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో బ్యాంకు అధికారులు, సిబ్బంది పాత్ర ఉన్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించామని వివరించారు. రామనగర, కనకపుర,చెన్నపట్టణ విభాగాల్లో ఎనిమిది మంది వ్యక్తుల ఖాతాల్లో సుమారు రూ. 120 కోట్ల నగదు ఇలానే బదిలీ అయిందని గుర్తించారు.

Tags:    

Similar News