కోడలిని శృంగారం చేయొద్దన్న మామ.. కారణం దెయ్యం!

దిశ, వెబ్ డెస్క్: ఇటీవలె పెళ్లి అయిన ఓ జంటకు కొత్త ప్రాబ్లమ్ వచ్చింది. ఏకాంతంగా తన భర్తతో గడుపుదామునుకున్న భార్యకు కుదరడం లేదు. కారణం.. ఆమె మామ. వాళ్లిద్దరి మధ్య గొడలా ఉన్నాడు. ఎందుకు మమ్మల్ని కలుసుకోనివ్వడం లేదని ఓ రోజు కొడలు మామను గట్టిగా నిలిదీసింది.. అప్పుడు అతను చెప్పిన సమాధానం విని అందరూ నోరెళ్లబెట్టారు. అదేంటంటే.. తన కుమారుడితో నువ్వు శృంగారం చేస్తే నీలో ఉన్న దెయ్యం అతనిలోకి వెళ్తుందని.. అప్పుడు అందరూ […]

Update: 2020-08-05 11:47 GMT

దిశ, వెబ్ డెస్క్: ఇటీవలె పెళ్లి అయిన ఓ జంటకు కొత్త ప్రాబ్లమ్ వచ్చింది. ఏకాంతంగా తన భర్తతో గడుపుదామునుకున్న భార్యకు కుదరడం లేదు. కారణం.. ఆమె మామ. వాళ్లిద్దరి మధ్య గొడలా ఉన్నాడు. ఎందుకు మమ్మల్ని కలుసుకోనివ్వడం లేదని ఓ రోజు కొడలు మామను గట్టిగా నిలిదీసింది.. అప్పుడు అతను చెప్పిన సమాధానం విని అందరూ నోరెళ్లబెట్టారు. అదేంటంటే..

తన కుమారుడితో నువ్వు శృంగారం చేస్తే నీలో ఉన్న దెయ్యం అతనిలోకి వెళ్తుందని.. అప్పుడు అందరూ ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని చెప్పాడు. అలా కొడలు పచ్చని కాపురంలో మామ చిచ్చుపెట్టాడు. ఈ ఘటన గుజరాత్‌లోని వడోదరలో ఆలస్యంగా వెలుగు చూసింది.

వివరాల్లోకివెళితే.. వడోదర జిల్లాలోని అల్కాపురికి చెందిన 43 ఏళ్ల మహిళకు కొన్నేళ్ల కిందట గాంధీనగర్‌కు చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. అయితే, ఇటీవల కాలంలో కోడలిని మామ తన కుమారుడికి దూరంగా ఉంచుతున్నాడు. కారణం.. ఆమెలో దెయ్యం ఉందని అతని నమ్మకం. కొడుకు, కోడలు శృంగారంలో పాల్గొంటే.. ఆమెలోని దెయ్యం అతనిలోకి వెళ్తుందని భయపడుతున్నాడు. దీంతో వాళ్లిద్దరిని పడక గదికి దూరంగా ఉంచుతూ మామ వేధిస్తున్నాడు.

ఈ అనాగరిక ఆలోచనలపై ఓ రోజు కోడలు గళమెత్తింది. మూర్ఖంగా ఆలోచిస్తున్నారని, తనలో ఎలాంటి ఆత్మలు లేవని చెప్పింది. దీంతో కోడలిని అత్తమామలు క్రూరంగా హింసించి కొట్టారు. అంతేకాకుండా తాను ఒంటరిగా ఉన్న సమయంలో తనతో శృంగారానికి మామను అత్త ఒత్తిడి చేసేదని బాధితురాలు పేర్కొంది. ఈ వేధింపులు తాళలేక ఈ ఏడాది మార్చి 10న అత్తమామలు, భర్త నుంచి విడిపోయింది. కొద్ది రోజులకు తన భర్త రాజీకి వచ్చాడు.. కానీ అత్తమామలు తనను వదిలించుకోవాలని చూస్తున్నారని బాధితురాలు ఆరోపించింది. చివరకు అత్తమామల ఆగడాలపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Tags:    

Similar News