’ఆ నిబంధన మార్చండి’

దిశ, స్పోర్ట్స్: క్రికెట్‌లో అంపైర్లు తప్పులు చేయడం సహజమే. అయితే, వారి తప్పుల వల్ల మ్యాచ్ చేజారి పోకుండా ఉండేందుకు ఐసీసీ ‘డెసిషన్ రివ్యూ సిస్టమ్’ (డీఆర్ఎస్)ను ప్రవేశపెట్టింది. ఈ నియమాన్ని 2008లో తొలిసారిగా అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రవేశపెట్టారు. గతంలో టెస్టు మ్యాచ్‌లో ప్రతి ఇన్నింగ్స్‌కు 2 చొప్పున డీఆర్ఎస్ అవకాశాలు ఉండేవి. అయితే, కరోనా నేపథ్యంలో ఐసీసీ కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇన్నింగ్స్‌కు 3 డీఆర్ఎస్ నిర్ణయాలు ఇస్తున్నారు. ఈ నిర్ణయంపై క్రికెట్ దిగ్గజం సచిన్ […]

Update: 2020-07-12 07:04 GMT

దిశ, స్పోర్ట్స్: క్రికెట్‌లో అంపైర్లు తప్పులు చేయడం సహజమే. అయితే, వారి తప్పుల వల్ల మ్యాచ్ చేజారి పోకుండా ఉండేందుకు ఐసీసీ ‘డెసిషన్ రివ్యూ సిస్టమ్’ (డీఆర్ఎస్)ను ప్రవేశపెట్టింది. ఈ నియమాన్ని 2008లో తొలిసారిగా అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రవేశపెట్టారు. గతంలో టెస్టు మ్యాచ్‌లో ప్రతి ఇన్నింగ్స్‌కు 2 చొప్పున డీఆర్ఎస్ అవకాశాలు ఉండేవి. అయితే, కరోనా నేపథ్యంలో ఐసీసీ కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇన్నింగ్స్‌కు 3 డీఆర్ఎస్ నిర్ణయాలు ఇస్తున్నారు. ఈ నిర్ణయంపై క్రికెట్ దిగ్గజం సచిన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కరోనా నేపథ్యంలో డీఆర్‌ఎస్‌ల సంఖ్యను పెంచుతూ ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని మాస్టర్ స్వాగతించాడు. అయితే, డీఆర్‌ఎస్ విషయంలో ‘అంపైర్స్ కాల్’ అనే నిబంధనను మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ఎల్బీడబ్ల్యూ విషయంలో దీన్ని సవరించాల్సిన అవసరం ఉందని అపెక్స్ బోర్డుకు సూచించాడు. బౌలర్ వేసిన బంతి డీఆర్ఎస్‌లో వికెట్లను తాకుతున్నట్లు కనపడితే ఔటివ్వాలని, ఇందులో అంపైర్ కాల్‌ అవసరం లేదన్నారు. బంతి వికెట్లను 50శాతం కంటే తక్కువ తగులుతున్నట్లు అనిపిస్తే ‘అంపైర్ కాల్’ అని ప్రకటిస్తున్నారు. దీని వల్ల బౌలర్లకు అన్యాయం జరుగుతోందని సచిన్ అభిప్రాయపడ్డాడు.

Tags:    

Similar News