వణికిస్తున్న ఒమిక్రాన్.. 30 ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోస్
దిశ, వెబ్‌డెస్క్ : ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచదేశాలను టెన్షన్‌కు గురి చేస్తోంది. ఈ వేరియంట్ ఇప్పటికే 65 దేశాలకు పైగా కంట్రీస్‌లో వ్యాప్తి చెందుతోంది. భారత్‌లో కూడా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 40కి చేరువలో ఉన్నాయి. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పలు దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇదిలా ఉండగా ఈ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 30 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసులు అందించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. బూస్టర్ డోసుతో […]
దిశ, వెబ్‌డెస్క్ : ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచదేశాలను టెన్షన్‌కు గురి చేస్తోంది. ఈ వేరియంట్ ఇప్పటికే 65 దేశాలకు పైగా కంట్రీస్‌లో వ్యాప్తి చెందుతోంది. భారత్‌లో కూడా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 40కి చేరువలో ఉన్నాయి. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పలు దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇదిలా ఉండగా ఈ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 30 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసులు అందించడానికి ప్రభుత్వం సిద్ధమైంది.
బూస్టర్ డోసుతో ఒమిక్రాన్ నుంచి రక్షణ పెరుగుతుందని అధ్యయనాల్లో తేలిన నేపథ్యంలో, బ్రిటన్ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన వాటిని పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించి సోమవారం నుంచి బుకింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అయితే.. ఇప్పటికే 40 ఏళ్లకు పైబడిన 2 కోట్ల మందికి బూస్టర్ డోసులు అందించినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, 30-39 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు సుమారు 75 లక్షల మంది ఉండగా, అందులో 35 లక్షల మందిని బూస్టర్ డోసుకు అర్హులుగా తేల్చారు.