చిన్ని టీ పాట్.. అతన్ని లక్షాధికారి చేసింది
దిశ, వెబ్‌డెస్క్ : రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవాలంటే.. ఏం చేయాలి? అని పడుకునే ముందు చాలా మంది ఆలోచిస్తుంటారు. అయినా, ఏ ‘అలీబాబా అద్భుత దీపమో’ దొరికితే గానీ ఇది నిజం కాదని తమకు తామే నచ్చజెప్పుకుంటూ.. హాయిగా నిద్రలోకి జారుకుంటారు. అయితే, యూకేకు చెందిన ఓ 51 ఏళ్ల వ్యక్తికి అలాంటి అద్భుత దీపమేదీ దొరకలేదు గానీ.. వారి స్టోర్ రూమ్‌లో అంతకన్నా విలువైనదే దొరికింది. దీంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా ధనవంతుడు అయిపోయాడు. […]
దిశ, వెబ్‌డెస్క్ : రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవాలంటే.. ఏం చేయాలి? అని పడుకునే ముందు చాలా మంది ఆలోచిస్తుంటారు. అయినా, ఏ ‘అలీబాబా అద్భుత దీపమో’ దొరికితే గానీ ఇది నిజం కాదని తమకు తామే నచ్చజెప్పుకుంటూ.. హాయిగా నిద్రలోకి జారుకుంటారు. అయితే, యూకేకు చెందిన ఓ 51 ఏళ్ల వ్యక్తికి అలాంటి అద్భుత దీపమేదీ దొరకలేదు గానీ.. వారి స్టోర్ రూమ్‌లో అంతకన్నా విలువైనదే దొరికింది. దీంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా ధనవంతుడు అయిపోయాడు. ఇంతకీ అతని దొరికింది ఏంటో తెలుసా? ఓ చిన్ని ‘టీ పాట్’. కానీ, దాని విలువ మాత్రం అక్షరాల 95 లక్షల రూపాయలు!
లాక్‌డౌన్ అందరికీ సానుకూలంగా లేకపోయినా, ఈ యూకే మ్యాన్‌కు మాత్రం అదృష్టాన్ని తీసుకొచ్చింది. ఇంట్లోనే ఖాళీగా ఉండటంతో.. తన గారేజ్ క్లీన్ చేసే పని పెట్టుకున్నాడు. ఆ ప్రాసెస్‌లో తనకు ఓ చిన్ని (15 సెంటిమీటర్ల వైడ్) టీ పాట్ కనిపించింది. మొదట దాన్ని ఓ పనికిరాని వస్తువుగానే చూసిన తను చారిటీకి ఇచ్చేద్దామని డిసైడ్ అయ్యాడు. కానీ మనసు ఊరుకుంటుందా? చారిటీకి ఇచ్చేముందు ఓ సారి దాని విలువ తెలుసుకుంటే మంచిది కదా! అనుకున్నాడు. అలా.. ఆ టీ పాట్‌తో హన్సన్స్ ఆక్షన్ హౌస్‌కు వెళ్లాడు. దాన్ని చూసిన హన్సన్.. ఈ టీ పాట్‌ను 1735-1799 కాలంలో వైన్ తాగేందుకు వినియోగించేవారని, ఇది చాలా రేర్ పీస్ అని తెలిపాడు. అంతేకాదు, దీని విలువ 20 – 40 వేల పౌండ్ల వరకు ఉంటుందని వివరించాడు. దాంతో టీ పాట్ తెచ్చిన వ్యక్తి ఒకింత ఆశ్చర్యపోయాడు. కాగా, ఆ టీ పాట్‌ను వేలం వేయగా.. లక్ష పౌండ్లు (రూ. 95 లక్షల 73 వేల రూపాయలు) వచ్చింది.
‘మా అమ్మ దీన్ని కేబినెట్ డిస్‌ప్లేలో ఉంచేది. నాకు తెలిసి చైనా నుంచి దీన్ని మా తాతయ్య తీసుకొచ్చి ఉంటాడు. ఆయన రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఫార్ ఈస్ట్‌లో మిలిటరీ తరపున పనిచేశాడు. అంతేకాదు, ఆయన బర్మా స్టార్ మెడల్ అవార్డు కూడా పొందాడు’ అని టీ పాట్ యజమాని తెలిపాడు. సేమ్ ఇలాంటి టీ పాట్స్.. ఒకటి తైవాన్‌లోనే తైపె నేషనల్ ప్యాలెస్ మ్యూజియంలో ఉండగా, మరొకటి చైనాలోని బీజింగ్‌లో ప్యాలెస్ మ్యూజియంలో ఉంది.