శ్రీకాకుళంలో కిడ్నీ దినోత్సవం

శ్రీకాకుళం పట్టణంలో జెమ్స్‌, వాకర్స్‌ క్లబ్‌, క్రీడాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కిడ్నీ దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో ఈ ఉత్సవాలు నిర్వహించారు. రాష్ట్రంలో కిడ్నీ సమస్యలకు కేంద్రమైన ఉద్దానం శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్న సంగతి తెలిసిందే. ఉద్దానంలో ఇంచుమించు ప్రతి ఇంటా కిడ్నీ బాధితులు కనిపిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ప్రతినిధులు ఇక్కడి పరిస్థితులపై పరిశోధించినా కిడ్నీ సమస్యలను నివారించలేకపోయారు. గత ప్రభుత్వ హయాంలో డయాలసిస్ […]

Update: 2020-03-12 01:37 GMT

శ్రీకాకుళం పట్టణంలో జెమ్స్‌, వాకర్స్‌ క్లబ్‌, క్రీడాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కిడ్నీ దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో ఈ ఉత్సవాలు నిర్వహించారు. రాష్ట్రంలో కిడ్నీ సమస్యలకు కేంద్రమైన ఉద్దానం శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్న సంగతి తెలిసిందే. ఉద్దానంలో ఇంచుమించు ప్రతి ఇంటా కిడ్నీ బాధితులు కనిపిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ప్రతినిధులు ఇక్కడి పరిస్థితులపై పరిశోధించినా కిడ్నీ సమస్యలను నివారించలేకపోయారు. గత ప్రభుత్వ హయాంలో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసి కొంత ఉపశమనం కలిగించిన సంగతి తెలిసిందే. కిడ్నీ దినోత్సవ ర్యాలీని నిర్వహించి, బెలూన్లను వదిలి, మానవహారం చేపట్టారు.

tags : srikakulam, world kidney day, uddanam, kidney failure,

Tags:    

Similar News