Government: ఆ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇక పై అకౌంట్‌లోనే డబ్బులు జమ
రాష్ట్ర ప్రభుత్వం(Government) గుడ్ న్యూస్ చెప్పింది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం(Government) గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్దే(State Development) లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలను అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఎన్డీయే కూటమి ఎన్నికల ముందు చెప్పిన విధంగానే పింఛను పెంచి.. ఇంటింటికెళ్లి పంపిణీ చేస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. సామాజిక పింఛన్లు(Social pensions) తీసుకుంటున్న దివ్యాంగ విద్యార్థుల(Disabled students)కు ప్రభుత్వం ఊరట కలిగించింది. ఇప్పటి వరకు వారు గురుకులాలు, వసతి గృహాల నుంచి వచ్చి పింఛన్ తీసుకునే వారు. ఈ క్రమంలో దివ్యాంగ స్టూడెంట్స్ పెన్షన్(pensions) తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక పై వారు ఎక్కడకి వెళ్లాల్సిన అవసరం లేదని.. నేరుగా వారి అకౌంట్‌లోనే పెన్షన్ జమ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల సుమారు 10 వేల మంది దివ్యాంగ విద్యార్థులకు ఉపశమనం కలగనుంది.