అక్రమ దందా.. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు సస్పెండ్
దిశ ప్రతినిధి, నిజామాబాద్: డబ్బు అంటే ఎవ్వరికీ చేదు. అందుకే ఇసుక అక్రమ రవాణా జరుగుతుంటే మగ కానిస్టేబుల్ మామూళ్లు వసూళ్లు చేస్తుంటే.. వారికీ మహిళా కానిస్టేబుళ్లు కూడా తొడయ్యారు. తాము ఎందులో తీసిపోమని ఇసుక లారిల వద్ద వసూళ్లకు దిగారు. దానితో జిల్లా ఎస్పీ విచారణ జరిపి మిగతా ఇద్దరు మగ కానిస్టేబుళ్ళతో పాటు ఇద్దరు ఆడ కానిస్టేబుళ్ళను సస్పెండ్ చేశారు. ఇప్పటి వరకు ఇసుక క్వారీలు, అక్రమ రవాణా దారుల వద్ద మామూళ్లు వసూళ్లు […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్: డబ్బు అంటే ఎవ్వరికీ చేదు. అందుకే ఇసుక అక్రమ రవాణా జరుగుతుంటే మగ కానిస్టేబుల్ మామూళ్లు వసూళ్లు చేస్తుంటే.. వారికీ మహిళా కానిస్టేబుళ్లు కూడా తొడయ్యారు. తాము ఎందులో తీసిపోమని ఇసుక లారిల వద్ద వసూళ్లకు దిగారు. దానితో జిల్లా ఎస్పీ విచారణ జరిపి మిగతా ఇద్దరు మగ కానిస్టేబుళ్ళతో పాటు ఇద్దరు ఆడ కానిస్టేబుళ్ళను సస్పెండ్ చేశారు. ఇప్పటి వరకు ఇసుక క్వారీలు, అక్రమ రవాణా దారుల వద్ద మామూళ్లు వసూళ్లు చేసి కానిస్టేబుల్ సస్పెండ్ కావడం చాలా సార్లు జరిగినా.. మహిళా కానిస్టేబుల్ మాత్రం తొలిసారి.
కామారెడ్డి జిల్లా బిచ్కుంద పోలీస్ స్టేషన్ లో నలుగురు పోలీస్ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేస్తూ జిల్లా ఎస్పీ శ్వేత రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మంజీరా నది నుండి తరలివెళ్తున్న ఇసుక లారీల నుండి అక్రమంగా డబ్బులు వసులు చేస్తున్న కారణంగా సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్వేతా రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇసుక లారీల వద్ద డబ్బులు వసూలు చేసినందుకు బిచ్కుంద పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సంతోష్, పరంధామయ్య, భవిత, మైశ క లను సస్పెండ్ చేశారు. గురువారం ఉదయం బిచ్కుంద మండలం కత్గావ్ ఇసుక క్వారీ నుండి వే బిల్లులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న 5 లారీలను మద్నూర్ మండలం మెనుర్ వద్ద పట్టుకుని పోలీసులు కేసు నమోదు చేశారు.
మంజీర నదిపై జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో 6 ఇసుక రీచ్ లు ఉన్నాయి. అక్కడ నియమ నిబంధనలను తుంగలో తోక్కి ఇసుక ఆక్రమ రవాణా జరుగుతుంది. ఇసుక క్వారీల వద్ధ గోడవలు జరగకుండా పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన మంజీరా నదిలో ఇసుక క్వారీల నిర్వాహకులు అక్రమంగా ఇసుక రవాణా చేసుకుంటూ దండిగా సొమ్ము చేసుకుంటున్నారు. వాళ్లు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఆదాయం సొమ్ము చేస్తున్న విషయం బహిరంగ రహస్యమే. అక్కడ గొడవలు, అల్లర్లు జరగకుండా రక్షణ కోసం ఏర్పాటు చేసిన పోలీసులు.. బలవంతపు వసూళ్లు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా ఇసుక రీచ్ ల నుంచి వెళ్లే లారీల వద్ద డబ్బుల వసూళ్ళకు రెండు ప్రైవేట్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.
అక్కడ నిత్యం ఇసుక లారీల వద్ద లారీకి రూ.500 నుంచి 1000 వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. గురువారం కొందరు కానిస్టేబుళ్ళు లారీల వద్ద వసూల్ చేస్తున్న వీడియో మే 27న సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. దానితో జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించడంతో.. నిజమని తెలింది.
ఇసుక క్వారీల వద్ద ఘర్షణలు చెలరేగితే తక్షణం అదుపు చేయడానికి కొంతమంది పోలీసులు, అధిక లోడ్‌తో వెళ్తున్న లారీలను అడ్డుకోవడానికి మరికొంతమంది పోలీసులను పోలీస్ ఉన్నతాధికారులు ఇసుక రీచ్ల ప్రధాన రహదారుల వెంబడి రక్షణ కొరకు ఏర్పాటు చేశారు. పది మంది రీచ్ కు రక్షణగా ఉంటున్నారు.
కొంతమంది పోలీసులు చెక్ పోస్టుల వద్ద అధిక లోడ్ తో, వే బిల్లులు లేకుండా, పోరుగు రాష్ట్రాలకు వెళ్తున్న ఇసుక లారీల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. అక్రమంగా తరలిపోతున్న ఇసుక లారీలను అడ్డుకోవాల్సిన పోలీసులే కంచే చేను మేసే చందంగా ఇసుక లారీల నుంచి డబ్బులు వసూళ్లకు ఎగబడటం సిగ్గుచేటని పలువురు కొంతమంది పోలీసుల పనితీరుపై విమర్శలు చేస్తున్నారు. ఒక కింది స్థాయి కానిస్టేబుల్ అవినీతి ఈ విధంగా ఉంటే పై అధికారుల అవినీతి ఏ స్థాయిలో ఉంటుందో తేటతెల్లమవుతోంది.