కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదలు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. నవాకాడల్ ఏరియాలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతులను వేర్పాటువాద నాయకుడు మహమ్మద్ అష్రఫ్ ఖాన్ సెహ్రాయ్ తనయుడు, హిజ్బుల్ ముజాహిద్దీన్ డివిజినల్ కమాండర్ జునైద్ అష్రఫ్ ఖాన్‌తోపాటు పుల్వామాకు చెందిన తారీఖ్ అహ్మద్ షేక్‌లుగా గుర్తించినట్టు డీజీపీ దిల్‌బాగ్ సింగ్ వెల్లడించారు. సెంట్రల్ కశ్మీర్ ఏరియాలోని ఉగ్రవాద కార్యకలాపాలను జునైద్ పర్యవేక్షిస్తున్నారని […]
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదలు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. నవాకాడల్ ఏరియాలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతులను వేర్పాటువాద నాయకుడు మహమ్మద్ అష్రఫ్ ఖాన్ సెహ్రాయ్ తనయుడు, హిజ్బుల్ ముజాహిద్దీన్ డివిజినల్ కమాండర్ జునైద్ అష్రఫ్ ఖాన్‌తోపాటు పుల్వామాకు చెందిన తారీఖ్ అహ్మద్ షేక్‌లుగా గుర్తించినట్టు డీజీపీ దిల్‌బాగ్ సింగ్ వెల్లడించారు. సెంట్రల్ కశ్మీర్ ఏరియాలోని ఉగ్రవాద కార్యకలాపాలను జునైద్ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఈయనపై అనేక కేసులున్నాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కాగా, ఇంకా కొనసాగుతన్న ఈ ఆపరేషన్‌లో ముగ్గురు పోలీసు సిబ్బంది కూడా గాయపడ్డారు. సీఆర్‌పీఎఫ్, జమ్ము కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నవాకాడల్‌లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేశాయి.