సెల్ఫీ దిగేందుకు వెళ్లి.. గోదావరిలో ఇద్దరు గల్లంతు
దిశ, ఖమ్మం: సెల్ఫీ దిగాలన్న సరదా ఇద్దరు యువకుల ప్రాణాలు తీసింది. గోదావరి నదిలోకి ఫొటో దిగేందుకు వెళ్లిన యువకుడు, బాలుడు గల్లంతయ్యారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం జరిగింది. భద్రాచలం ముదిరాజ్ కాలనీకి చెందిన పవన్(29) తనకు దగ్గరి బంధువైన తులసీరామ్(12)తో కలసి గోదావరి తీరానికి సరదాగా గడిపేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే సెల్ఫీ దిగాలని ఇద్దరు కలసి గోదావరి నదిలోకి దిగారు. నదిలో దిగుతున్న క్రమంలోనే వెనక్కి తూలిపడిపోయారు. ఇద్దరు నీట […]
దిశ, ఖమ్మం: సెల్ఫీ దిగాలన్న సరదా ఇద్దరు యువకుల ప్రాణాలు తీసింది. గోదావరి నదిలోకి ఫొటో దిగేందుకు వెళ్లిన యువకుడు, బాలుడు గల్లంతయ్యారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం జరిగింది. భద్రాచలం ముదిరాజ్ కాలనీకి చెందిన పవన్(29) తనకు దగ్గరి బంధువైన తులసీరామ్(12)తో కలసి గోదావరి తీరానికి సరదాగా గడిపేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే సెల్ఫీ దిగాలని ఇద్దరు కలసి గోదావరి నదిలోకి దిగారు. నదిలో దిగుతున్న క్రమంలోనే వెనక్కి తూలిపడిపోయారు. ఇద్దరు నీట మునగడం ఒడ్డున ఉన్న కొంతమంది చూసి కాపాడేందుకు యత్నించినా వారి ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసులు, కుటుంబ సభ్యులు గజ ఈతగాళ్లతో నదిలో వెతికినా మృతదేహాలు లభ్యం కాలేదు. సంఘటన బుధవారం సాయంత్రం జరగడంతో చీకట్లో వెతుకులాట సాధ్యం కాలేదు. దీంతో గురువారం ఉదయం గాలింపు చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు, రోదనలతో గోదావరి తీరం మిన్నంటింది.