ఇద్దరికి కత్తిపోట్లు.. ఆర్థిక లావాదేవీల చిచ్చు
దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లా కారంపూడి సినిమాహల్ సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రిటైర్డ్ విద్యుత్ అధికారి ఆలూరు లక్ష్మణరావుపై అతని దూరపు బంధువు బొల్లాపల్లి మండలంలోని పేర్లపాడు గ్రామానికి చెందిన కోట్ల నాగేశ్వరరావు కత్తితో దాడికి పాల్పడ్డాడు. నాగేశ్వరరావుకు లక్ష్మణరావు డబ్బులు ఇవ్వాల్సి ఉండగా, తన డబ్బులు తనకు ఇవ్వాలని నాగేశ్వరరావు పలుమార్లు లక్ష్మణరావును అడిగిన ఇవ్వకుండా మెుండి కేయడంతో మంగళవారం ఉదయం నాగేశ్వరరావు కారంపూడి వచ్చి లక్ష్మణరావుతో గొడవకు దిగాడు. దీంతో […]
దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లా కారంపూడి సినిమాహల్ సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రిటైర్డ్ విద్యుత్ అధికారి ఆలూరు లక్ష్మణరావుపై అతని దూరపు బంధువు బొల్లాపల్లి మండలంలోని పేర్లపాడు గ్రామానికి చెందిన కోట్ల నాగేశ్వరరావు కత్తితో దాడికి పాల్పడ్డాడు. నాగేశ్వరరావుకు లక్ష్మణరావు డబ్బులు ఇవ్వాల్సి ఉండగా, తన డబ్బులు తనకు ఇవ్వాలని నాగేశ్వరరావు పలుమార్లు లక్ష్మణరావును అడిగిన ఇవ్వకుండా మెుండి కేయడంతో మంగళవారం ఉదయం నాగేశ్వరరావు కారంపూడి వచ్చి లక్ష్మణరావుతో గొడవకు దిగాడు. దీంతో సహనం కోల్పోయిన నాగేశ్వరరావు..లక్ష్మణరావు, అతని మనవడుపై కత్తితో దాడి చేశాడు. ఈ నేపథ్యంలో ఆలూరు లక్ష్మణ రావుకి తీవ్రగాయాలు కాగా మనవడికి స్వల్పగాయాలయ్యాయి. నిందితుడు కోట్ల నాగేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు కారంపూడి పోలీసులు తెలిపారు.