యూపీలో సాధువుల దారుణ హత్య

ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. శివాలయంలో ఉన్న ఇద్దరు సాధువులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన బులంద్‌షహర్‌లో చోటుచేసుకుంది. సాధువుల మృతదేహాలు రక్త మడుగులో పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై గ్రామస్తులు ఆందోళన బాటపట్టారు. దీంతో అధికారులు అదనపు బలగాలను మొహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సాధువుల హత్య నిందితులను త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. Tags: Saints, murder, up, […]

Update: 2020-04-27 23:26 GMT

ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. శివాలయంలో ఉన్న ఇద్దరు సాధువులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన బులంద్‌షహర్‌లో చోటుచేసుకుంది. సాధువుల మృతదేహాలు రక్త మడుగులో పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై గ్రామస్తులు ఆందోళన బాటపట్టారు. దీంతో అధికారులు అదనపు బలగాలను మొహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సాధువుల హత్య నిందితులను త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Tags: Saints, murder, up, temple, crime news

Tags:    

Similar News