ఫ్లాష్ ఫ్లాష్ : నకిలీ చలాన్ల స్కాంలో ఇద్దరు అధికారుల సస్పెన్షన్

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో తాజాగా నకిలీ చలాన్ల స్కాం భయటపడిన విషయం తెలిసిందే. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే కర్నూలు జిల్లా నంద్యాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోకి ఇద్దరు ఉద్యోగులపై వేటు పడింది. సబ్ రిజిస్ట్రార్ సోఫియాబేగం, జూనియర్ అసిస్టెంట్ వీరన్నలను సస్పెండ్ చేస్తూ జిల్లా పాలనాధికారి ఆదేశాలు జారీచేశారు. భారీగా చలాన్లలో అవకతవకలకు పాల్పడినట్టు విచారణలో నిర్దారణ జరిగింది. మరికొందరు స్టాంప్ రైటర్లపై అధికారులు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. […]

Update: 2021-08-12 11:19 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో తాజాగా నకిలీ చలాన్ల స్కాం భయటపడిన విషయం తెలిసిందే. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే కర్నూలు జిల్లా నంద్యాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోకి ఇద్దరు ఉద్యోగులపై వేటు పడింది. సబ్ రిజిస్ట్రార్ సోఫియాబేగం, జూనియర్ అసిస్టెంట్ వీరన్నలను సస్పెండ్ చేస్తూ జిల్లా పాలనాధికారి ఆదేశాలు జారీచేశారు. భారీగా చలాన్లలో అవకతవకలకు పాల్పడినట్టు విచారణలో నిర్దారణ జరిగింది. మరికొందరు స్టాంప్ రైటర్లపై అధికారులు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

మొత్తంగా ఈ కేసులో ఆరుగురు స్టాంప్ రైటర్స్ హస్తం ఉన్నట్టు విచారణ అధికారులు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఒక్కసారిగా నకిలీ చలాన్ల స్కాం రాష్ట్రాన్ని కుదిపేయడంతో నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయం మూగబోయింది. పాత్ర దారులు, సూత్రదారులపై పోలీసులు నిఘా పెట్టారు. ఇంటెలిజెన్స్ విభాగం పూర్తి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. కాగా, నకిలీ చలాన్ల స్కాం వలన ఏపీ ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని కోల్పోయినట్టు సమాచారం.

Tags:    

Similar News