కారు ప్రమాదంలో గద్వాలవాసి మృతి
దిశ, మహబూబ్ నగర్: కర్నాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గద్వాల జిల్లా వాసి మృతి చెందాడు. రాయచూర్ జిల్లా సింధనూర్ సమీపంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కేటీ దొడ్డి గ్రామానికి చెందిన హన్మంతు కుమారుడు గోపాల్ బెంగళూరులో ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవల హన్మంతు కుటుంబ సభ్యులు తన కుమారుడిని చూడటానికి బెంగళూరుకు వెళ్లారు. కరోనా వైరస్ కారణంగా కేంద్రం […]
దిశ, మహబూబ్ నగర్: కర్నాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గద్వాల జిల్లా వాసి మృతి చెందాడు. రాయచూర్ జిల్లా సింధనూర్ సమీపంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కేటీ దొడ్డి గ్రామానికి చెందిన హన్మంతు కుమారుడు గోపాల్ బెంగళూరులో ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవల హన్మంతు కుటుంబ సభ్యులు తన కుమారుడిని చూడటానికి బెంగళూరుకు వెళ్లారు. కరోనా వైరస్ కారణంగా కేంద్రం లాక్ డౌన్ ప్రకటించడంతో వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో హన్మంతు కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి కారులో స్వగ్రామానికి బయలుదేరారు. కారు గురువారం ఉదయం సిందనూర్ సమీపంలో అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురు క్షతగాత్రులను రాయచూర్ ఆసుపత్రికి తరలించారు. మృతులు గోపాల్, మరో వ్యక్తి బెంగళూరుకు చెందిన కారు డ్రైవర్‌గా గుర్తించారు. గోపాల్‌కు ఏడాది క్రితమే వివాహమైంది.
Tags: road accident, karnataka, gadwal, crime news