మృతదేహాన్ని తీసుకెళ్తూ లారీని ఢీకొట్టిన బొలెరో
దిశ, ఏపీబ్యూరో : మృత దేహాన్ని బొలెరో వాహనంలో తరలిస్తున్న సమయంలో లారీని ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం ఉదయం ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం మోక్షగుండం సమీపంలో చోటుచేసుకుంది. కొమరోలు మండలం బుంగాయపల్లెకు చెందిన తురక వెంకట సుబ్బయ్య(73) అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్త్రెవేటు ఆస్పత్రిలో చనిపోయాడు. మృతదేహాన్ని తీసుకుని కుటుంబ సభ్యులు పది మంది బొలెరో వాహనంలో బయలుదేరారు. మోక్షగుండం వద్దకు వచ్చేటప్పుడు ముందున్న లారీని బొలెరో వాహనం ఢీ […]
దిశ, ఏపీబ్యూరో : మృత దేహాన్ని బొలెరో వాహనంలో తరలిస్తున్న సమయంలో లారీని ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం ఉదయం ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం మోక్షగుండం సమీపంలో చోటుచేసుకుంది. కొమరోలు మండలం బుంగాయపల్లెకు చెందిన తురక వెంకట సుబ్బయ్య(73) అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్త్రెవేటు ఆస్పత్రిలో చనిపోయాడు.
మృతదేహాన్ని తీసుకుని కుటుంబ సభ్యులు పది మంది బొలెరో వాహనంలో బయలుదేరారు. మోక్షగుండం వద్దకు వచ్చేటప్పుడు ముందున్న లారీని బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. చనిపోయింది మృతుని కూతురు, అల్లుడు కావడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.