నదిలో కొట్టుకుపోయిన కారు.. ఇద్దరు మృతి

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ రాష్ట్రంలో నివర్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. సైక్లోన్ తీరం దాటే సమయంలో వీచిన గాలులకు చాలా ప్రాంతాల్లో భారీ వృక్షాలు సైతం నెలకొరిగాయి. ఇక కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో జనజీవనం స్తంభించిపోయింది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. తాజాగా కడప జిల్లాలోని నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అందులో ఓ కారు కొట్టుకుపోయింది. ఈ ఘటన కడప జిల్లా గుర్రంకొండ చిన్నామండెం దగ్గర […]

Update: 2020-11-27 04:33 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ రాష్ట్రంలో నివర్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. సైక్లోన్ తీరం దాటే సమయంలో వీచిన గాలులకు చాలా ప్రాంతాల్లో భారీ వృక్షాలు సైతం నెలకొరిగాయి. ఇక కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో జనజీవనం స్తంభించిపోయింది.

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. తాజాగా కడప జిల్లాలోని నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అందులో ఓ కారు కొట్టుకుపోయింది. ఈ ఘటన కడప జిల్లా గుర్రంకొండ చిన్నామండెం దగ్గర శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.మృతులు రాజంపేటకు చెందిన రవి, వెంకట సుబ్బయ్యగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News