ఆ అడవిలో ఇద్దరు మావోయిస్టులను చంపారు

దిశ, భద్రాచలం: మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లా కవాసిపార – బేర్ గుడ్రా అడవుల్లో శనివారం మధ్యాహ్నం 1.30 సమయంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. అనంతరం ఘటనా స్థలంలో డీఆర్‌జీ బలగాలు ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు, ఒక 9 ఎంఎం పిస్టల్, మరో దేశీ కట్టా ఆయుధాలతోపాటు సుమారు 5 కిలోల ఐఈడీ, నక్సల్స్ యూనిఫామ్స్ స్వాధీనం […]

Update: 2021-03-20 09:37 GMT

దిశ, భద్రాచలం: మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లా కవాసిపార – బేర్ గుడ్రా అడవుల్లో శనివారం మధ్యాహ్నం 1.30 సమయంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. అనంతరం ఘటనా స్థలంలో డీఆర్‌జీ బలగాలు ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు, ఒక 9 ఎంఎం పిస్టల్, మరో దేశీ కట్టా ఆయుధాలతోపాటు సుమారు 5 కిలోల ఐఈడీ, నక్సల్స్ యూనిఫామ్స్ స్వాధీనం చేసుకున్నారు. కుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు దంతెవాడ ఎస్‌పీ అభిషేక్ పల్లవ్ తెలిపారు. ఎన్‌కౌంటర్ మృతుల్లో రూ.3లక్షల రివార్డు కలిగిన కటేకళ్యాణ్ ఎల్‌జీఎస్ డిప్యూటీ కమాండర్ మడివి హడమా, మరొకరు రూ. లక్ష రివార్డు గల ఈటేపాల్ జనమిలీషియా కమాండర్ అయితా అని పోలీసులు భావిస్తున్నారు.

Tags:    

Similar News