పోలీసుల అదుపులో ఇద్దరు మావోయిస్టులు
దిశ, భద్రాచలం : ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పోలీసులు ఇద్దరు మావోయిస్టులను అరెస్టు చేశారు. ఇందులో ఒకరు డీఏకెఎంఎస్ ఉపాధ్యక్షుడు మడివి పొజ్జా, మరొకరు మిలీషియా సభ్యుడు బట్టా వినోద్. సుక్మా ఎస్పీ సునీల్ శర్మ మావోయిస్టుల అరెస్టు వివరాలు మీడియాకు తెలిపారు. కూంబింగ్ ఆపరేషన్లో భాగంగా చింతల్నార్ పోలీస్స్టేషన్ పరిధిలో కోబ్రా 201 బెటాలియన్ పోలీసులు, డిస్ట్రిక్ట్ ఫోర్స్ పోలీసులు కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా తారసపడిన ఇద్దరు మావోయిస్టులను అరెస్టుచేసి […]
దిశ, భద్రాచలం : ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పోలీసులు ఇద్దరు మావోయిస్టులను అరెస్టు చేశారు. ఇందులో ఒకరు డీఏకెఎంఎస్ ఉపాధ్యక్షుడు మడివి పొజ్జా, మరొకరు మిలీషియా సభ్యుడు బట్టా వినోద్. సుక్మా ఎస్పీ సునీల్ శర్మ మావోయిస్టుల అరెస్టు వివరాలు మీడియాకు తెలిపారు. కూంబింగ్ ఆపరేషన్లో భాగంగా చింతల్నార్ పోలీస్స్టేషన్ పరిధిలో కోబ్రా 201 బెటాలియన్ పోలీసులు, డిస్ట్రిక్ట్ ఫోర్స్ పోలీసులు కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా తారసపడిన ఇద్దరు మావోయిస్టులను అరెస్టుచేసి వారి వద్ద నుంచి ఎలక్ట్రిక్ డిటోనేటర్స్, కార్డెక్స్ వైరు, ఎలక్ట్రిక్ వైరు, పెన్సిల్ సెల్స్, నక్సల్స్ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో జరిగిన అనేక సంఘటనలలో వీరు పాలుపంచుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. సెక్షన్ 4,5 పేలుడు పదార్థాల చట్టం 1908 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.