పోలీస్‌స్టేషన్ ఎదుట ఇద్దరు రైతుల ఆత్మహత్యాయత్నం
దిశ, దుబ్బాక: ఇద్దరు రైతులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లాలో కలకలం రేపుతోంది. భూమి విషయంలో పోలీసులు తమకు అన్యాయం చేస్తున్నారంటూ బాధిత రైతులు ఆరోపించారు. వివరాల్లోకి వెళితే .. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి గ్రామానికి చెందిన బెక్కంటి మురళి, దేవయ్య అనే రైతులు మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ ఎదుట డీజిల్ ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామంలోని 1452 సర్వే నెంబర్‌లోని ఏడెకరాల భూమికి సంబంధించిన పట్టాలు […]
దిశ, దుబ్బాక: ఇద్దరు రైతులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లాలో కలకలం రేపుతోంది. భూమి విషయంలో పోలీసులు తమకు అన్యాయం చేస్తున్నారంటూ బాధిత రైతులు ఆరోపించారు. వివరాల్లోకి వెళితే .. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి గ్రామానికి చెందిన బెక్కంటి మురళి, దేవయ్య అనే రైతులు మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ ఎదుట డీజిల్ ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
గ్రామంలోని 1452 సర్వే నెంబర్‌లోని ఏడెకరాల భూమికి సంబంధించిన పట్టాలు తమ వద్ద ఉన్నప్పటికీ గ్రామానికి చెందిన మరో వ్యక్తి అక్రమంగా భూమిని పట్టా చేశారంటూ బాధిత రైతులు ఆరోపించారు. తమ భూమిలో వ్యవసాయ పనులు కోసం వెళ్తే అక్రమంగా పట్టా చేయించుకున్న వ్యక్తి అట్రాసిటీ కేసు పెట్టాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణకు వచ్చిన ఏసీసీ రామేశ్వర్ భూమిపై సర్వ హక్కులు పట్టాలో ఉన్నవారికే ఉంటాయని తేల్చిచెప్పడంతో.. మనస్తాపానికి గురైన బాధిత రైతులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.