రెండు రోజులు వైన్స్, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు బంద్..

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో నెల 8న పరిషత్ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రెండు రోజులు సెలవులు ప్రకటించింది. పోలింగ్ రోజు(8వ తేదీ)తో పాటు, 7వ తేదీన కూడా సెలవురోజుగా ప్రకటిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. 7వ తేదీన ఎన్నికల ఏర్పాట్ల నిమిత్తం సెలవు ఇస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రెండ్రోజుల పాటు ప్రభుత్వ కార్యాలయాలు, […]

Update: 2021-04-05 11:40 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో నెల 8న పరిషత్ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రెండు రోజులు సెలవులు ప్రకటించింది. పోలింగ్ రోజు(8వ తేదీ)తో పాటు, 7వ తేదీన కూడా సెలవురోజుగా ప్రకటిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. 7వ తేదీన ఎన్నికల ఏర్పాట్ల నిమిత్తం సెలవు ఇస్తున్నట్టు వెల్లడించింది.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రెండ్రోజుల పాటు ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, వాణిజ్య సంస్థలకు సెలవు ఉంటుందని తెలిపింది. కాగా, ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో రెండు రోజులు ముందుగానే మద్యం షాపులు మూతపడనున్నాయి.

 

Tags:    

Similar News