AP Assembly: ఏపీ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో అయోమయం
అసెంబ్లీలో బిల్లుల ప్రవేశానికి ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. నేడు జరిగిన ప్రశ్నోత్తరాల్లో అయోమయ పరిస్థితులు కనిపించాయి. ఇందుకు కారణం అధికారులేనంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu) ఆగ్రహం వ్యక్తం చేశారు.
దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ (AP Assembly) సమావేశాలు 8వ రోజు జరుగుతున్నాయి. అసెంబ్లీలో బిల్లుల ప్రవేశానికి ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. నేడు జరిగిన ప్రశ్నోత్తరాల్లో అయోమయ పరిస్థితులు కనిపించాయి. ఇందుకు కారణం అధికారులేనంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక శాఖకు సంబంధించిన ప్రశ్నలను మరో శాఖకు ఎలా పంపుతారని ప్రశ్నించారు. ఇళ్ల స్థలాలు, ఇళ్ల పంపిణీకి సంబంధించిన ప్రశ్నను రెవెన్యూ శాఖకు ఎలా వేస్తారని అడిగారు. ప్రశ్నోత్తరాల సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అదేవిధంగా ఒకేరోజు మంత్రికి.. మండలి, అసెంబ్లీల్లో ఒకేసారి ప్రశ్నలు ఎలా వేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి (Nimmala Ramanaidu) ఇటు అసెంబ్లీలో గోదావరి పుష్కరాల పనులపై ప్రశ్న వేశారు. అదే సమయంలో అటు మండలిలో గాలేరు నగరి, హంద్రీనీవా అనుసంధాన ప్రాజెక్టులపై ప్రశ్నించారు. ఉభయ సభల్లోనూ మంత్రికి ఒకే సమయంలో ప్రశ్నలు రావడంపై స్పీకర్ విస్మయం చెందారు.