కారు డోర్ లాక్.. ఇద్దరు చిన్నారులు మృతి
దిశ, వెబ్‌డెస్క్: కారు డోర్ లాకై ఇద్దరు చిన్నారులు మృతిచెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలం రేవూడితండాలో మంగళవారం మధ్యాహ్నం ఐదేళ్ల బాలుడు శ్రీనివాస్, నాలుగేళ్ల చిన్నారి యమున కారులో ఆడుకుంటుండగా డోర్లు లాకయ్యాయి. దీంతో చిన్నారులకు ఊపిరడక కారులోనే ప్రాణాలు విడిచారు. పిల్లల మృతదేహాలను చూసిన తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు […]
దిశ, వెబ్‌డెస్క్: కారు డోర్ లాకై ఇద్దరు చిన్నారులు మృతిచెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలం రేవూడితండాలో మంగళవారం మధ్యాహ్నం ఐదేళ్ల బాలుడు శ్రీనివాస్, నాలుగేళ్ల చిన్నారి యమున కారులో ఆడుకుంటుండగా డోర్లు లాకయ్యాయి. దీంతో చిన్నారులకు ఊపిరడక కారులోనే ప్రాణాలు విడిచారు. పిల్లల మృతదేహాలను చూసిన తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.