రెండు బస్సులు ఢీ.. ఏడుగురు మృతి
దిశ, వెబ్‌డెస్క్ : ఆప్ఘనిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆప్ఘన్ రాజధాని కాబుల్ నగరంలో ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఏడుగురు మృతి చెందగా మరో 70మంది గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుల్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.