మాజీ కౌన్సిలర్ హత్య.. ఇద్దరు అరెస్ట్
దిశ, జనగామ: జనగామలో జరిగిన మాజీ కౌన్సిలర్ హత్యకు భూ తగాదాలే ప్రధాన కారణమని డీసీపీ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. గురువారం డీసీపీ మీడియాతో వివరాలు వెల్లడిస్తూ… జనగామకు చెందిన మాజీ కౌన్సిలర్ పులి స్వామికి యశ్వంతపూర్ గ్రామంలో ఉన్న భూమి వివాదంలో ఉన్న సంగతి తెలిసిందే. గతకొద్ది రోజుల క్రితం జరిగిన విచారణ అనంతరం కోర్టు పులి స్వామికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆగ్రహానికి గురైన గడ్డం నిఖిల్, ప్రవీణ్‌లు తమకు ఆస్తి రాకుండా చేశాడని, […]
దిశ, జనగామ: జనగామలో జరిగిన మాజీ కౌన్సిలర్ హత్యకు భూ తగాదాలే ప్రధాన కారణమని డీసీపీ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. గురువారం డీసీపీ మీడియాతో వివరాలు వెల్లడిస్తూ… జనగామకు చెందిన మాజీ కౌన్సిలర్ పులి స్వామికి యశ్వంతపూర్ గ్రామంలో ఉన్న భూమి వివాదంలో ఉన్న సంగతి తెలిసిందే. గతకొద్ది రోజుల క్రితం జరిగిన విచారణ అనంతరం కోర్టు పులి స్వామికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆగ్రహానికి గురైన గడ్డం నిఖిల్, ప్రవీణ్‌లు తమకు ఆస్తి రాకుండా చేశాడని, ఎప్పటికైనా స్వామిని చంపుతామని గ్రామానికి వచ్చారు. ఈ నేపథ్యంలో కోపోద్రిక్తులైన ప్రవీణ్, నిఖిల్ క్షణికావేశంతో గురువారం ఉదయం పులి స్వామిని గొడ్డలితో నరికి చంపినట్లు పోలీసుల విచారణ తేలింది. ఈ విషయాన్ని నిందితులిద్దరూ ఒప్పుకున్నట్లు డీసీపీ తెలిపారు. దీంతో ఇరువురినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. అయితే నేరం జరిగిన గంటల్లోనే నిందితులను పట్టుకున్న జనగామ పోలీసులను డీసీపీ అభినందించారు.