నకిలీ స్టాంప్ పేపర్లు విక్రయించే ఇద్దరు అరెస్టు

దిశ, క్రైమ్ బ్యూరో: మోసపూరితంగా నకిలీ స్టాంపు పేపర్లను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఆసిఫ్ నగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ఫిరోజ్ అలీ సిటీ సివిల్ కోర్టులో డాక్యుమెంటరీ రైటర్‌గా పనిచేస్తున్నాడు. అయితే కుటుంబ నిర్వహణకు కొద్దిపాటి ఆదాయం సరిపోకపోవడంతో.. పాత నాన్ జ్యూడిషియల్ స్టాంప్ పేపర్లను సేకరిస్తూ, వాటిలోని రచనలను ఇంక్ రిమూవర్ ద్వారా చెరిపివేసి అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. లైసెన్స్ గడువు ముగిసినా స్టాంప్ విక్రేత […]

Update: 2021-03-22 11:25 GMT

దిశ, క్రైమ్ బ్యూరో: మోసపూరితంగా నకిలీ స్టాంపు పేపర్లను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఆసిఫ్ నగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ఫిరోజ్ అలీ సిటీ సివిల్ కోర్టులో డాక్యుమెంటరీ రైటర్‌గా పనిచేస్తున్నాడు. అయితే కుటుంబ నిర్వహణకు కొద్దిపాటి ఆదాయం సరిపోకపోవడంతో.. పాత నాన్ జ్యూడిషియల్ స్టాంప్ పేపర్లను సేకరిస్తూ, వాటిలోని రచనలను ఇంక్ రిమూవర్ ద్వారా చెరిపివేసి అధిక ధరలకు విక్రయిస్తున్నాడు.

లైసెన్స్ గడువు ముగిసినా స్టాంప్ విక్రేత భానుప్రకాష్ ద్వారా సరూర్ నగర్ వద్ద విక్రయిస్తున్నట్టు పోలీసులు సమాచారం అందుకున్నారు. దీంతో ఫిరోజ్ అలీ, టీవీ భానుప్రకాష్‌ను అరెస్టు చేశారు. ఫిరోజ్ అలీ గతంలో ఇదే తరహా కేసులో అరెస్ట్ అయినట్లు టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ చక్రవర్తి గుమ్మి తెలిపారు.

Tags:    

Similar News