థాయ్‌లాండ్‌ హోటళ్లలో ఉద్యోగాలంటూ…

దిశ, క్రైమ్ బ్యూరో: థాయ్‌లాండ్‌ హోటళ్లలో ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి డబ్బు వసూళ్లకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణగూడ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని మహావీర్ లోక్ భవనంలో సెరీనా ఇన్ ఫ్రా అనే కన్సల్టెన్సీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి.. మేనేజర్లుగా పందిరి కిరణ్, మీర్ మహ్మద్ మసీయుద్దీన్ వ్యవహరించారు. దాదాపు 100మందికి పైగా నిరుద్యోగుల నుంచి రూ.1.20లక్షల చొప్పున రూ.కోటికి పైగా వసూలు చేశారు. అయితే నవంబర్ 12న […]

Update: 2021-01-31 08:56 GMT

దిశ, క్రైమ్ బ్యూరో: థాయ్‌లాండ్‌ హోటళ్లలో ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి డబ్బు వసూళ్లకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణగూడ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని మహావీర్ లోక్ భవనంలో సెరీనా ఇన్ ఫ్రా అనే కన్సల్టెన్సీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి.. మేనేజర్లుగా పందిరి కిరణ్, మీర్ మహ్మద్ మసీయుద్దీన్ వ్యవహరించారు. దాదాపు 100మందికి పైగా నిరుద్యోగుల నుంచి రూ.1.20లక్షల చొప్పున రూ.కోటికి పైగా వసూలు చేశారు. అయితే నవంబర్ 12న డబ్బులు ఇచ్చిన సీహెచ్ భూమేశ్, సూరకాంతి పవన్‌, కరుణాకర్‌లకు ఇంకా ఆఫర్ లెటర్ ఇవ్వలేదు. అంతేగాక 3నెలలుగా కార్యాలయానికి తాళం వేసి ఉంది. ఈ విషయంపై ప్రశ్నించిన బాధితులను బెదిరింపులకు గురిచేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags:    

Similar News