తప్పుడు సమాచారాన్ని నిరోధించేందుకు ట్విట్టర్ ‘బర్డ్‌వాచ్’

దిశ, ఫీచర్స్: తప్పుడు సమాచారాన్ని కట్టడి చేయడంలో భాగంగా ట్విట్టర్ ‘బర్డ్ వాచ్’ అనే మరో కొత్త టూల్‌ను అభివృద్ధి చేసింది. డెస్క్‌టాప్, ఆండ్రాయిడ్, ఐవోఎస్‌ వినియోగదారుల్లో కొంతమందికి పైలట్ ప్రాజెక్ట్‌గా దీన్ని రోల్ అవుట్ చేస్తున్నట్లు మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ తాజాగా ప్రకటించింది. బర్డ్‌వాచ్ ఫీచర్ ద్వారా యూజర్స్ తమకు అనుమానమున్న ట్వీట్‌లను మార్క్ చేసి, అందుకు గల కారణాలను వివరించాలి. మనం ఏదైనా ట్వీట్‌ను బర్డ్‌వాచ్‌తో మార్క్ చేసిన తర్వాత, సదరు ట్వీట్‌పై […]

Update: 2021-06-04 06:51 GMT

దిశ, ఫీచర్స్: తప్పుడు సమాచారాన్ని కట్టడి చేయడంలో భాగంగా ట్విట్టర్ ‘బర్డ్ వాచ్’ అనే మరో కొత్త టూల్‌ను అభివృద్ధి చేసింది. డెస్క్‌టాప్, ఆండ్రాయిడ్, ఐవోఎస్‌ వినియోగదారుల్లో కొంతమందికి పైలట్ ప్రాజెక్ట్‌గా దీన్ని రోల్ అవుట్ చేస్తున్నట్లు మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ తాజాగా ప్రకటించింది.

బర్డ్‌వాచ్ ఫీచర్ ద్వారా యూజర్స్ తమకు అనుమానమున్న ట్వీట్‌లను మార్క్ చేసి, అందుకు గల కారణాలను వివరించాలి. మనం ఏదైనా ట్వీట్‌ను బర్డ్‌వాచ్‌తో మార్క్ చేసిన తర్వాత, సదరు ట్వీట్‌పై ఫీడ్‌బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫీడ్‌బ్యాక్ సహాయకరంగా ఉందో లేదో రేట్ చేసే అవకాశం వినియోగదారులకు ఉంటుందని ట్విట్టర్ తెలిపింది. ఈ క్రమంలోనే ట్వీట్‌కు వచ్చిన రిప్లయ్‌లు ఏవీ సహాయపడవని భావిస్తే, బర్డ్‌వాచ్ కార్డ్ డిజప్పియర్ అవుతుంది. ఒకవేళ ఇచ్చిన నోట్స్ సహాయకరంగా భావించినట్లయితే అవి ట్వీట్ లోపల నేరుగా పాపప్ అవుతాయి.

‘ట్వీట్ చేసిన సమాచారం తప్పో, ఒప్పో తెలుసుకోవడానికి బర్డ్ వాచ్ సాయపడుతుంది. ట్వీట్‌లో చేసిన ఇన్ఫర్మేషన్ తప్పు అని భావించిన ట్విట్టర్ యూజర్ దానిపై బర్డ్ వాచ్‌‌తో టిక్ చేయొచ్చు. సదరు ట్వీట్ ఎందుకు తప్పు తెలుసుకోనేందుకు చిన్నపాటి సర్వే జరుగుతుంది. దానిపై ట్వీపుల్స్ రిపోర్ట్ చేయవచ్చు. ఒకవేళ ఆ ట్వీట్ సరైనది అయితే ఓకే చెప్పొచ్చు లేదంటే తప్పని వెల్లడించొచ్చు. చివరికి విస్తృత, విభిన్నమైన యూజర్ల నుంచి ఏకాభిప్రాయం ఉన్నప్పుడు గ్లోబల్ ట్విట్టర్ ప్రేక్షకుల కోసం ఆ నోట్స్ ట్వీట్లలో నేరుగా కనిపించేలా డిస్‌ప్లే చేస్తాం. తప్పుదోవ పట్టించే సమాచారం వ్యాప్తి చెందుతున్నప్పుడు ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది’ అని ప్రొడక్ట్ వీపీ కైత్ కొల్‌మాన్ తెలిపారు. అయితే బర్డ్ వాచ్‌లోని ట్వీట్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై కంపెనీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.

ప్రస్తుత సోషల్ మీడియా ఫ్రేమ్‌వర్క్‌లో బర్డ్‌వాచ్ ఎలా పనిచేస్తుందనే అంశంపై చాలా మందిలో అనుమాలున్నాయి. స్వతంత్ర వాస్తవ తనిఖీ సంస్థలను తీసుకువచ్చిన ఫేస్‌బుక్ వంటి ఇతర ప్లాట్‌ఫారమ్‌లు ఉపయోగించే కేంద్రీకృత ప్రయత్నాలకు బదులుగా ట్విట్టర్ కమ్యూనిటీ ఫీడ్‌బ్యాక్‌ను ఉపయోగిస్తోంది. ఫీడ్‌బ్యాక్ సహాయకరంగా ఉందో లేదో నిర్ణయించడానికి ప్రేక్షకులకే వదిలేసింది. ఇది విజబిలిటీ ఆఫ్ ఫ్యాక్ట్ చెక్‌ను కూడా నిర్ణయించబోతోంది. ఇది ఎలా పని చేస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News