‘అంకుల్.. కూల్ కూల్, చింతవద్దు’
ఢిల్లీ అల్లర్ల ఘటనపై నటి స్వరా భాస్కర్ మండిపడ్డారు. ఇంటెలిజెన్స్ బ్యూరో సెక్యురిటీ అసిస్టెంట్ అంకిత్ శర్మతో పాటు 24 మంది చనిపోయారన్నవార్తతో తన హృదయం విచ్ఛిన్నమైందని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోతే ఇలాంటి విషాద ఘటనలే చూడాల్సి వస్తుందని ట్వీట్ చేశారు. అయితే ఈ విషయంలో మాజీ శివసేన నాయకుడు, హిందుత్వ కార్యకర్త రమేష్ సోలంకి స్వరాభాస్కర్‌ను హెచ్చరించారు. ‘హలో స్వరా.. రెండు నెలల నుంచి చాలా […]
ఢిల్లీ అల్లర్ల ఘటనపై నటి స్వరా భాస్కర్ మండిపడ్డారు. ఇంటెలిజెన్స్ బ్యూరో సెక్యురిటీ అసిస్టెంట్ అంకిత్ శర్మతో పాటు 24 మంది చనిపోయారన్నవార్తతో తన హృదయం విచ్ఛిన్నమైందని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోతే ఇలాంటి విషాద ఘటనలే చూడాల్సి వస్తుందని ట్వీట్ చేశారు.
అయితే ఈ విషయంలో మాజీ శివసేన నాయకుడు, హిందుత్వ కార్యకర్త రమేష్ సోలంకి స్వరాభాస్కర్‌ను హెచ్చరించారు. ‘హలో స్వరా.. రెండు నెలల నుంచి చాలా నాటకాలు చేస్తున్నావు.. ఇక ఆపేయ్.. లేదంటే నీ పాపాలకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని.. భగవంతుడు అన్నీ చూస్తున్నాడు’ అని ట్వీట్ చేశాడు.
దీంతో మండిపోయిన స్వరా.. ‘అంకుల్ మీరు నా కోసం చింతించొద్దు. అసలు విషయం ఏంటంటే మీ భావజాల పచ్చబొట్ల వల్లే ఇంత మంది బలయ్యారు.. ఏదో ఒక రోజు ఇది మిమ్మల్ని కూడా దహించేస్తుంది’ అని కౌంటర్ ఇచ్చారు. అయితే స్వరా భాస్కరే ప్రజలను వీధుల్లోకి వచ్చి గొడవలు సృష్టించమని పిలుపునిచ్చిందని, ఢిల్లీ అల్లర్ల కుట్రలో మెయిన్ రోల్ తనదేనని, వెంటనే అరెస్ట్ చేయాలని రమేష్ సోలంకి పోలీసులకు సూచించడం గమనార్హం.