వెనక్కి తగ్గిన ట్విట్టర్.. వెంకయ్యకు తిరిగొచ్చిన బ్లూ టిక్

దిశ, వెబ్‌డెస్క్: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్సనల్ ట్విట్టర్ అకౌంట్‌కు బ్లూటిక్‌ను ట్విట్టర్‌ తొలగించడంపై వివాదం చెలరేగింది. దీనిపై మండిపడుతున్న నెటిజన్లు.. ట్విట్టర్‌ను ఇండియాలో బ్యాన్ చేయాలని ట్రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎట్టకేలకు ట్విట్టర్ వెనక్కి తగ్గింది. వెంకయ్య అకౌంట్‌కు బ్లూ టిక్‌ను పునరుద్దరించింది. అటు RSS చీఫ్ మోహన్ భగవత్ అకౌంట్‌కు కూడా బ్లూ టిక్‌ను తొలగించింది. అయితే ఆయన అకౌంట్‌కు ఇంకా పునరుద్దరించలేదు. వెంకయ్య అకౌంట్‌కు బ్లూ టిక్‌ను తొలగించడంపై ట్విట్టర్‌ను ఉపరాష్ట్రపతి కార్యాలయం […]

Update: 2021-06-05 01:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్సనల్ ట్విట్టర్ అకౌంట్‌కు బ్లూటిక్‌ను ట్విట్టర్‌ తొలగించడంపై వివాదం చెలరేగింది. దీనిపై మండిపడుతున్న నెటిజన్లు.. ట్విట్టర్‌ను ఇండియాలో బ్యాన్ చేయాలని ట్రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎట్టకేలకు ట్విట్టర్ వెనక్కి తగ్గింది. వెంకయ్య అకౌంట్‌కు బ్లూ టిక్‌ను పునరుద్దరించింది. అటు RSS చీఫ్ మోహన్ భగవత్ అకౌంట్‌కు కూడా బ్లూ టిక్‌ను తొలగించింది. అయితే ఆయన అకౌంట్‌కు ఇంకా పునరుద్దరించలేదు.

వెంకయ్య అకౌంట్‌కు బ్లూ టిక్‌ను తొలగించడంపై ట్విట్టర్‌ను ఉపరాష్ట్రపతి కార్యాలయం వివరణ కోరింది. దీనిపై స్పందించిన ట్విట్టర్ యాజమాన్యం.. ఏడాదిగా ఆ ట్విట్టర్ అకౌంట్ యాక్టివ్‌లో లేదని, తమ నిబంధనల ప్రకారం ఏడాదిగా యాక్టివ్‌గా లేకపోతే బ్లూటిక్ తొలగిస్తామని తెలిపింది. దీంతో వెంకయ్య ఉపరాష్ట్రపతి అయ్యాక.. ఉపరాష్ట్రపతి కార్యాలయ ట్విట్టర్ అకౌంట్ నుంచి సమాచారం పంచుకుంటున్నారని, ఆయన పర్సనల్ అకౌంట్ యాక్టివ్‌లో లేనట్లు కాదని తెలిపింది. దీంతో ట్విట్టర్ కన్ఫామ్ చేసుకుని వెంటనే వెంకయ్య పర్సనల్ అకౌంట్‌కు బ్లూ టిక్‌ను పునరుద్దరించింది.

Tags:    

Similar News