ట్రంప్‌కు ట్విట్టర్ మరో షాక్

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రంప్‌ మద్దతుదారులకు చెందిన సుమారు 70వేల అకౌంట్లను ట్విట్టర్ నిలిపివేసింది. ఇప్పటికే ట్రంప్‌ ఖాతాను ట్విట్టర్ శాశ్వతంగా నిషేధించింది. గతవారం అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్‌ ఎన్నికను ధృవీకరించేందుకు యూఎస్‌ క్యాపిటల్‌లో యూఎస్ కాంగ్రెస్‌ సమావేశమైంది. దానిని అడ్డుకునేందుకు క్యాపిటల్‌ భవనంలోకి ట్రంప్‌ మద్దతుదారులు చొచ్చుకు రావడంతో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు పౌరులతో సహా ఓ పోలీస్‌ అధికారి […]

Update: 2021-01-11 22:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రంప్‌ మద్దతుదారులకు చెందిన సుమారు 70వేల అకౌంట్లను ట్విట్టర్ నిలిపివేసింది. ఇప్పటికే ట్రంప్‌ ఖాతాను ట్విట్టర్ శాశ్వతంగా నిషేధించింది.

గతవారం అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్‌ ఎన్నికను ధృవీకరించేందుకు యూఎస్‌ క్యాపిటల్‌లో యూఎస్ కాంగ్రెస్‌ సమావేశమైంది. దానిని అడ్డుకునేందుకు క్యాపిటల్‌ భవనంలోకి ట్రంప్‌ మద్దతుదారులు చొచ్చుకు రావడంతో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు పౌరులతో సహా ఓ పోలీస్‌ అధికారి మృతి చెందాడు. సమావేశానికి ముందు ట్రంప్‌ తన మద్దతుదారులనుద్దేశించి వరుస ట్వీట్లు చేశారు. అవి హింసను మరింత ప్రేరేపించే ప్రమాదం ఉన్నందున అకౌంట్‌ను శాశ్వతంగా నిలిపివేసినట్లు వెల్లడించింది. కాగా, క్యాపిటల్‌ ఘటనకు సంబంధించిన కంటెంట్‌ను షేర్‌ చేస్తున్న వేలాది ఖాతాలను శుక్రవారం నుంచి శాశ్వతంగా నిలివేస్తున్నట్లు ట్విట్టర్‌ పేర్కొంది.

Tags:    

Similar News