ఎయిర్‌పోర్ట్‌లో కూలీగా మారిన మాజీ హీరోయిన్..
దిశ, సినిమా: బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తనకంటూ ఫాన్స్ బేస్ సొంతం చేసుకుంది నటి ట్వింకిల్ ఖన్నా. అక్షయ్ కుమార్‌తో పెళ్లి తర్వాత ఇంటికే పరిమితమైన ఈ నటి.. తాజాగా ఓ తీపి జ్ఞాపకాన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ప్రముఖ రచయిత్రి భావన ఇటీవల ‘ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా’ పేరుతో పుస్తకాన్ని రాయగా.. ఇందులో ట్వింకిల్‌తో పాటు ఆమె తల్లి డింపుల్ కపాడియా గురించి పలు విషయాలు పొందుపరిచినట్లు చెప్పింది. ఓసారి విమానాశ్రయంలో అనుకోకుండా తల్లీ […]
దిశ, సినిమా: బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తనకంటూ ఫాన్స్ బేస్ సొంతం చేసుకుంది నటి ట్వింకిల్ ఖన్నా. అక్షయ్ కుమార్‌తో పెళ్లి తర్వాత ఇంటికే పరిమితమైన ఈ నటి.. తాజాగా ఓ తీపి జ్ఞాపకాన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ప్రముఖ రచయిత్రి భావన ఇటీవల ‘ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా’ పేరుతో పుస్తకాన్ని రాయగా.. ఇందులో ట్వింకిల్‌తో పాటు ఆమె తల్లి డింపుల్ కపాడియా గురించి పలు విషయాలు పొందుపరిచినట్లు చెప్పింది. ఓసారి విమానాశ్రయంలో అనుకోకుండా తల్లీ కూతుళ్లను కలిశానని, ఆ సమయంలో ట్వింకిల్ తన భుజాల మీద లగేజీని మోస్తుండగా, డింపుల్ మాత్రం కుర్చీలో కూర్చొని ఉందనే విషయాన్ని పుస్తకంలో ప్రస్తావించింది.
అయితే ఎందుకు బరువులు మోస్తున్నావని ట్వింకిల్‌ను అడిగితే.. అమ్మకు చెక్ ఇన్ ప్రాసెస్ అంటే ఇష్టముండదని, ఫ్లైట్ ల్యాండింగ్ తర్వాత ఎదురు చూడటం తనకు అస్సలు నచ్చదని క్లారిటీ ఇచ్చినట్లు చెప్పింది. అందుకే అమ్మకు కూలీగా మారాల్సి వచ్చిందని ట్వింకిల్ వివరించినట్లు భావన తన పుస్తకంలో పేర్కొంది.