కీప్యాడ్ ఫోన్లకు కేరాఫ్ అతడే..

దిశ, వెబ్‌డెస్క్ : స్మార్ట్‌ఫోన్‌ల హవా అంతగా లేనప్పుడు, కీప్యాడ్ ఫోన్లను ఎంతో అపూరూపంగా చూసుకునేది. అప్పుడు సెల్‌ఫోన్ చేతిలో ఉంటేనే ఏదో ఖరీదైన వస్తువు మన దగ్గర ఉన్న ఫీలింగ్ కలిగేది. నోకియా, సోనీ, మోటోరోలా, శాంసంగ్ విడుదల చేసిన ఫీచర్ ఫోన్లలో ఇప్పుడునన్ని ఫీచర్లు లేకున్నా.. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ ఈజీగా ఉపయోగించేలా ఆ ఫోన్లు ఉండేవి. టెక్నాలజీ పెరగడంతో ఫోన్ రూపురేఖలు మారిపోయాయి. క్రమంగా ఫీచర్ ఫోన్ల స్థానాన్ని స్మార్ట్ […]

Update: 2020-11-21 06:43 GMT

దిశ, వెబ్‌డెస్క్ : స్మార్ట్‌ఫోన్‌ల హవా అంతగా లేనప్పుడు, కీప్యాడ్ ఫోన్లను ఎంతో అపూరూపంగా చూసుకునేది. అప్పుడు సెల్‌ఫోన్ చేతిలో ఉంటేనే ఏదో ఖరీదైన వస్తువు మన దగ్గర ఉన్న ఫీలింగ్ కలిగేది. నోకియా, సోనీ, మోటోరోలా, శాంసంగ్ విడుదల చేసిన ఫీచర్ ఫోన్లలో ఇప్పుడునన్ని ఫీచర్లు లేకున్నా.. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ ఈజీగా ఉపయోగించేలా ఆ ఫోన్లు ఉండేవి. టెక్నాలజీ పెరగడంతో ఫోన్ రూపురేఖలు మారిపోయాయి. క్రమంగా ఫీచర్ ఫోన్ల స్థానాన్ని స్మార్ట్ ఫోన్స్ ఆక్రమించేశాయి. అయితే ఆ పాత ఫోన్లను ఇప్పటికీ భద్రంగా దాచుకున్నవారు కూడా ఉన్నారు. అలా.. ఆనాటి ఫోన్లను అద్భుతమైన నిధిలా, అందమైన జ్ఞాపకంలా దాచుకున్నాడో వ్యక్తి. ఇంతకీ ఆయన దగ్గర ఏమేం మోడల్ ఫోన్స్ ఉన్నాయంటే?

టర్కీకి చెందిన సహబెట్టిన్‌ ఒసెలిక్‌‌కు ఫోన్లంటే చాలా ఇష్టం. అందులోనూ పాత తరం(కీప్యాడ్) ఫోన్లంటే మరీ మక్కువ. స్వతహాగా సెల్‌ఫోన్‌ మెకానిక్‌ అయిన ఓసెలిక్ 20 ఏళ్ల నుంచే అదే పని చేస్తున్నాడు. తన దుకాణానికి వచ్చే అన్ని తరహా మొబైల్స్‌ను రిపేర్ చేసే అతడికి, వాటిని సేకరించాలనే ఆలోచన వచ్చింది. అలా ఇప్పటివరకు 1000కి పైగా సెల్‌ఫోన్ మోడళ్లను సేకరించాడు. ఏదో ఒక రోజు కీప్యాడ్ ఫోన్లన్నీ అవుట్‌డేటెడ్‌ అయిపోతాయని, తయారీ ఆగిపోతుందని తెలుసని ఒసెలిక్ పేర్కొన్నాడు. భవిష్యత్తులో జరిగేది ముందే ఊహించడంతో, అప్పుడున్న పాతతరం మొబైల్స్ అన్నీ కూడా అరుదైనవిగా గుర్తింపు పొందుతాయని ఉద్దేశంతోనే సేకరించానని ఆయన చెప్పుకొచ్చాడు.

ఒసలిక్ దగ్గరున్న మొబైళ్లు ఇప్పటికీ పనిచేస్తుండటం విశేషం. అరుదైన ఫోన్లు కూడా అతడి వద్ద ఉండటంతో చాలా మంది తమకు విక్రియంచమని అడుగుతున్నా, తను అందుకు ఇష్టపడటం లేదు. అయితే 2 వేలకు పైగా ఫోన్లు తన దగ్గర ఉండేవని, ఇటీవలే దొంగలు పడటంతో 700 వరకు ఫోన్లు పోయాయని ఒసెలిక్ వివరించాడు. ఒసెలిక్ లాగానే, స్లొవేకియాకు చెందిన స్టీఫెన్ పొల్గరీకి కూడా అరుదైన పాత, కొత్త రకం ఫోన్లను సేకరించడం అలవాటు.

Tags:    

Similar News