విశాఖలో టర్కీ కరెన్సీ.. ముఠా అరెస్ట్

దిశ, విశాఖపట్నం: విశాఖలో టర్కీ దేశపు కరెన్సీ వ్యాపారం చేస్తున్న ముఠాను శనివారం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ అజిత వెజెండ్ల మీడియాతో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… విశాఖలోని పోర్టు స్టేడియం వద్ద టర్కీ దేశపు కరెన్సీ చూపించి ఇద్దరు వ్యక్తుల స్ధానికుల నుంచి రూ. 5 లక్షలు అడ్వాన్స్ అడుగుతున్నట్టు ద్వారకా క్రైం పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే ఘటనా […]

Update: 2020-11-07 08:10 GMT

దిశ, విశాఖపట్నం: విశాఖలో టర్కీ దేశపు కరెన్సీ వ్యాపారం చేస్తున్న ముఠాను శనివారం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ అజిత వెజెండ్ల మీడియాతో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… విశాఖలోని పోర్టు స్టేడియం వద్ద టర్కీ దేశపు కరెన్సీ చూపించి ఇద్దరు వ్యక్తుల స్ధానికుల నుంచి రూ. 5 లక్షలు అడ్వాన్స్ అడుగుతున్నట్టు ద్వారకా క్రైం పోలీసులకు సమాచారం అందింది.

దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరిన పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. విదేశీ కరెన్సీ పేరిట చెల్లని నోట్లను పత్రాలుగా చూపిస్తూ ఇద్దరు సభ్యులు ప్రజల్ని మోసం చేస్తున్నట్టు గుర్తించారు. అలాగే ఇదే ముఠాకు చెందిన మరో నలుగురు వ్యక్తులు విదేశాల్లో డిమాండ్‌ అధికంగా ఉండే రంగురాళ్లు తమ వద్ద ఉన్నాయని, ప్రజల్ని మోసం చేస్తుండగా వారిని కూడా అరెస్ట్‌ చేశామని తెలిపారు.

Tags:    

Similar News