గవర్నర్ ఆమోదం దురదృష్టకరం

దిశ, వెబ్ డెస్క్: మూడు రాజధానులకు ఏపీ గవర్నర్ ఆమోదముద్ర వేయడం దురదృష్టకరమని.. ఇది రాష్ట్ర చరిత్రలోనే చీకటి రోజని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ విషయంలో జరిగినదే.. మూడు రాజధానుల విషయంలోనూ జరుగుతుందన్నారు. గవర్నర్ సంతకం చేస్తే చట్టం అవుతుందని కానీ, ఆ చట్టాలు హైకోర్టులో నిలబడవని అన్నారు. ఇల్లు అలకగానే పండుగ కాదు అనే విషయాన్నిప్రభుత్వ పెద్దలు గ్రహించాలని సూచించారు. 2014లో అసెంబ్లీ సాక్షిగా ఏపీ రాజధానిగా అమరావతిని […]

Update: 2020-07-31 08:40 GMT
congress senior leader tulasi reddy
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: మూడు రాజధానులకు ఏపీ గవర్నర్ ఆమోదముద్ర వేయడం దురదృష్టకరమని.. ఇది రాష్ట్ర చరిత్రలోనే చీకటి రోజని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ విషయంలో జరిగినదే.. మూడు రాజధానుల విషయంలోనూ జరుగుతుందన్నారు. గవర్నర్ సంతకం చేస్తే చట్టం అవుతుందని కానీ, ఆ చట్టాలు హైకోర్టులో నిలబడవని అన్నారు. ఇల్లు అలకగానే పండుగ కాదు అనే విషయాన్నిప్రభుత్వ పెద్దలు గ్రహించాలని సూచించారు.

2014లో అసెంబ్లీ సాక్షిగా ఏపీ రాజధానిగా అమరావతిని స్వాగతించిన జగన్.. ఇప్పుడు మాటతప్పారని ఎద్దేవా చేశారు. జగన్‌కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని తులసి రెడ్డి సవాల్ విసిరారు. వెంకటేశ్వరస్వామికే పంగనామాలు పెట్టిన బీజేపీ పెద్దలు రాజధాని విషయంలో ఏమైనా చేస్తారని మండిపడ్డారు. హైకోర్టును తరలించాలంటే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి అని అన్నారు.

Tags:    

Similar News