AP High Court: హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి.. ముందస్తు బెయిల్‌కు పిటిషన్ దాఖలు
నెల్లూరు (Nellore) జిల్లా పొదలకూరు (Podalakuru) మండల పరిధిలోని రుస్తుం మైన్స్‌లో అక్రమంగా క్వార్ట్జ్ ఖనిజం (Quartz Mineral) కొల్లగొట్టిన కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy)తో పాటు మరో తొమ్మిది మందిపై ఈ నెల 25న పోలీసులు కేసు నమోదు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు (Nellore) జిల్లా పొదలకూరు (Podalakuru) మండల పరిధిలోని రుస్తుం మైన్స్‌లో అక్రమంగా క్వార్ట్జ్ ఖనిజం (Quartz Mineral) కొల్లగొట్టిన కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy)తో పాటు మరో తొమ్మిది మందిపై ఈ నెల 25న పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ (FIR)లో కాకాణిని A4 నిందితుడిగా చేర్చారు. ఇది వరకే ముగ్గురిపై కేసు నమోదు కాగా.. సోమవారం కాకాణితో సహా మరో ఏడుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దీంతో ఆయన అరెస్ట్ తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ హైకోర్టు (High Court)ను ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులో ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు.
కాగా, నెల్లూరు జిల్లాలోని క్వార్డ్జ్ నిక్షేపాలను మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కొల్లగొట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. రుస్తుం మైన్స్ నుంచి దాదాపు రూ.250 కోట్ల విలువైన క్వార్ట్జ్ విలువైన ప్రభుత్వ సంపద కొల్లగొట్టారని అప్పట్లో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పోరాటం చేశారు. అక్రమ మైనింగ్‌ను అడ్డుకునేందుకు ఆయన సత్యాగ్రహ దీక్ష కూడా చేపట్టారు. అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పరిణామాలు తారుమారయ్యాయి. సోమిరెడ్డి ఫిర్యాదు మేరకు మాజీ కాకాణి ఆయన అనుచరులపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో మాజీ మంత్రి కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.