రాష్ట్ర కార్మిక కుటుంబాలకు శుభవార్త .. ఉచిత విద్యుత్ పై ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత కార్మికులకు ప్రభుత్వం శుభవార్తను అందించింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు చేనేత కార్మికుల ఇళ్లకు నెల 200 యూనిట్ల చొప్పున ప్రభుత్వం ఉచిత విద్యుత్ పై ముందడుగు పడింది.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత కార్మికులకు (Handloom workers) ప్రభుత్వం శుభవార్తను అందించింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు చేనేత కార్మికుల ఇళ్లకు నెల 200 యూనిట్ల చొప్పున ప్రభుత్వం ఉచిత విద్యుత్ (200 units of free electricity) పై ముందడుగు పడింది. అలాగే పవర్ లూమ్ లకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం (Govt) సిద్ధం అయ్యింది. ఈ మేరకు విద్యుత్ శాఖ (Department of Electricity)కు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు (Orders of the State Govt) జారీ చేసింది. ఈ ఉచిత విద్యుత్ పథకం (Free electricity scheme) ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 93 వేల చేనేత కుటుంబాలతో పాటుగా.. 10,534 పవర్ లూమ్ యూనిట్లకు మేలు జరగనుంది.
కాగా ప్రభుత్వం ఇచ్చిన ఉచిత విద్యుత్ పరిమితి కంటే చేనేత కుటుంబాలు కానీ, పవర్ లూమ్ యూనిట్లు (Powerloom Units) గాని అధికంగా విద్యుత్ ఉపయోగిస్తే.. అదనంగా వాడిన యూనిట్ల (usedunits)కు వినియోగదారులు ఖచ్చితంగా ఛార్జీలు చెల్లించాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో (Government orders) పేర్కొంది. ఏది ఏమైనప్పటికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తో చేనేత కార్మికులకు (Handloom workers) ఖర్చు తగ్గడంతో ఆర్థిక భారం కూడా తగ్గుతుంది. ఇది ఆ రంగం అభివృద్ధికి దోహదపడుతుందని మేదావులు అంచనా వేస్తున్నారు. అలాగే ప్రభుత్వ నిర్ణయంపై చేనేత కార్మికులు, నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.