YS Sharmila: పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతి.. వైఎస్ షర్మిల సెన్సేషనల్ కామెంట్స్
పాస్టర్ ప్రవీణ్ పగడాల (Praveen Pagadala) అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: పాస్టర్ ప్రవీణ్ పగడాల (Praveen Pagadala) అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. తొలుత ఆయన బైక్ ప్రమాదం (Bike Accident)లో చనిపోయారని అందరూ భావించినా.. ప్రవీన్ ఒంటిపై గాయాలు కనిపించాయాని ఆయన అనుచరులు అనుమానం వ్యక్తం చేశారు. ఆయన బైక్‌పై హైదరాబాద్ (Hyderabad) నుంచి విశాఖపట్నం (Vishakhapatnam)కు బైక్‌పై వెళ్తుండగా.. దివాన్ చెరువు-కొంతమూరు హైవేపై వెనుక నుంచి ఢీకొట్టి పథకం ప్రకారమే ప్రవీణ్‌పై దాడి చేసి ఉంటారని ఆయన సన్నిహితులు, అనుచరులు, పార్టర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు (CM Chandrababu) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పాస్టర్ మృతి ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరపాలని సీఎం ఆదేశించారు. ఇదే విషయమై ఆయన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా (DGP Harish Kumar Gupta)తో కూడా మాట్లాడారు.
ఈ క్రమంలోనే పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’ (ట్విట్టర్) వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాస్టర్ ప్రవీణ్‌ది రోడ్డు ప్రమాదం (Road Accident) కాదని.. ఘటనా స్థలంలో అది హత్య అనేందుకు చాలా రుజువులు ఉన్నాయని కామెంట్ చేశారు. ముమ్మాటికీ ఇది పక్కా ప్లాన్‌తో చేసిన హత్యేనని వారి కుటుంబ సభ్యులతో పాటు అందరికీ ప్రవీణ్ మృతిపై అనుమానాలు ఉన్నామని అన్నారు. ఈ దారుణ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు (CM Chandrababu) ప్రభుత్వం ప్రవీణ్ పగడాల మృతిపై వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించాలని.. నిజాలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రవీణ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నా అంటూ వైఎస్ షర్మిల (YS Sharmila) ట్వీట్ చేశారు.