మంగళవారం పంచాంగం, రాశిఫలాలు (04-05-2021)

శ్రీ ప్లవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసం బహుళ పక్షం తిధి : అష్టమి సా 5.52 తదుపరి నవమి వారం : మంగళవారం (భౌమ్యవాసరే) నక్షత్రం : శ్రవణం మ 1.05 తదుపరి ధనిష్ఠ యోగం : శుక్లం రా 12.34 తదుపరి బ్రహ్మం కరణం : బాలువ ఉ 6.24 తదుపరి కౌలువ సా 5.52 ఆ తదుపరి తైతుల తె 5.33 వర్జ్యం : సా 5.03 – […]

Update: 2021-05-03 11:45 GMT

శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
చైత్ర మాసం బహుళ పక్షం

తిధి : అష్టమి సా 5.52
తదుపరి నవమి
వారం : మంగళవారం (భౌమ్యవాసరే)
నక్షత్రం : శ్రవణం మ 1.05
తదుపరి ధనిష్ఠ
యోగం : శుక్లం రా 12.34
తదుపరి బ్రహ్మం
కరణం : బాలువ ఉ 6.24
తదుపరి కౌలువ సా 5.52
ఆ తదుపరి తైతుల తె 5.33
వర్జ్యం : సా 5.03 – 6.39
దుర్ముహూర్తం : ఉ 8.08 – 8.59 &
రా 10.48 – 11.33
అమృతకాలం: రా 2.39 – 4.15
రాహుకాలం : మ 3.00 – 4.30
యమగండం/కేతుకాలం: ఉ 9.00 – 10.30
సూర్యరాశి: మేషం || చంద్రరాశి: మకరం
సూర్యోదయం: 5.37 || సూర్యాస్తమయం: 6.16

మేషం : ఉద్యోగాలలో ఆశించిన పదవులు పొందుతారు. సమాజంలో సేవ కార్యక్రమాలు నిర్వహించి గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. భూ క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు సాధిస్తారు.

వృషభం : దీర్ఘకాలిక వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులనుండి విమర్శలు ఎదుర్కొంటారు.

మిధునం: చేపట్టిన పనులు చాలాకష్టం మీద పూర్తిఅవుతాయి ఋణ పరమైన ఒత్తిడిలు మానసిక సమస్యలు కలిగిస్తాయి. ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి వ్యాపారాలలో నష్ట సూచనలున్నవి , ఉద్యోగాలలో అధికారుల కోపానికి గురి అవుతారు.

కర్కాటకం : చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. వ్యాపారాలు పురోగతిలో సాధిస్తారు ఉద్యోగమున సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.

సింహం : చేపట్టిన వ్యవహారములలో అనుకూలత కలుగుతుంది చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయం లాభిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసివస్తాయి. వృత్తి వ్యాపారాలలో యత్న కార్యసిద్ధి. కలుగుతుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.

కన్య : బంధు మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.వ్యవహారాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి.ఆర్ధిక విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

తుల : కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహ పరుస్తుంది.

వృశ్చికం : దీర్ఘకాలిక వివాదాలు పరిష్కరించుకుంటారు. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సన్ని హితులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులకు అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది.

ధనస్సు : కుటుంబ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. నేత్ర సంభందిత ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. నూతన వ్యాపారవిస్తరణ ప్రయత్నాలు కలిసిరావు ఉద్యోగమున అదనపు బాధ్యతలు ఉంటాయి.

మకరం : ఖర్చుకు మించిన ఆదాయం సంతృప్తి కలిగిస్తుంది. సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం కలుగుతుంది. వ్యాపారాలలో నూతన ఆలోచనలు ఆచరణలో పెడతారు, ఉద్యోగమున ఆశించిన అవకాశములు అందుతాయి.

కుంభం : పాత ఋణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదాపడతాయి. జీవిత భాగస్వామితో అకారణ వివాదాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తివ్యాపారాలలో ఊహించని మార్పులు తప్పవు ఉద్యోగమున ప్రతికూల వాతావరణం ఉంటుంది.

మీనం : గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగు పడుతుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు అనుకూలత కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం ముందుకుసాగుతారు. ఉద్యోగస్తులకు అధికారుల అండ దండలు పొందుతారు.

Tags:    

Similar News