ఆ రాశి వారు ఆరోగ్యంపై దృష్టి సారిస్తే బెటర్..
తేది : 06 జూలై 2021 ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా సంవత్సరం : ప్లవనామ సంవత్సరం ఆయనం : ఉత్తరాయణం మాసం : జ్యేష్ఠమాసం ఋతువు : గ్రీష్మ ఋతువు కాలము : వేసవికాలం వారము : మంగళవారం పక్షం : కృష్ణ (బహుళ) పక్షం తిథి : ద్వాదశి (నిన్న రాత్రి 10 గం॥ 31 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 1 గం॥ 2 ని॥ వరకు) నక్షత్రం : కృత్తిక (నిన్న […]
తేది : 06 జూలై 2021
ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ఠమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : మంగళవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : ద్వాదశి
(నిన్న రాత్రి 10 గం॥ 31 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 1 గం॥ 2 ని॥ వరకు)
నక్షత్రం : కృత్తిక
(నిన్న ఉదయం 12 గం॥ 13 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 3 గం॥ 19 ని॥ వరకు)
యోగము : శూలము
కరణం : కౌలవ
వర్జ్యం : (తెల్లవారు జాము 1 గం॥ 46 ని॥ నుంచి తెల్లవారు జామున 3 గం॥ 34 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఉదయం 12 గం॥ 36 ని॥ నుంచి మధ్యాహ్నం 2 గం॥ 24 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఉదయం 8 గం॥ 23 ని॥ నుంచి 9 గం॥ 15 ని॥ వరకు)(ఉదయం 10 గం॥ 6 ని॥ నుంచి 10 గం॥ 58 ని॥ వరకు)
రాహుకాలం : ( సాయంత్రం 3 గం॥ 36 ని॥ నుంచి 5 గం॥ 14 ని॥ వరకు)
గుళికకాలం : (ఉదయం 12 గం॥ 19 ని॥ నుంచి మధ్యాహ్నం 1 గం॥ 57 ని॥ వరకు)
యమగండం : ( ఉదయం 9 గం॥ 2 ని॥ నుంచి 10 గం॥ 40 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 46 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 54 ని॥ లకు
సూర్యరాశి : మిథునము
చంద్రరాశి : వృషభము
మేషరాశి : సమస్యలను అతిగా ఊహించుకోవటం వలన ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ఆశావాద దృక్పథంతో అనుకున్న కార్యాలను సాధించండి. వ్యాపారస్తులు తమ భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించండి. తోటి ఉద్యోగులతో వాదోపవాదాలకు దిగకండి. దాని వల్ల గొడవలు జరుగుతాయి. ఆఫీసులో మీ పని సామర్ధ్యం పని అందరి ప్రశంసలు. ఆదాయం పరవాలేదు దుబారా ఖర్చులు నివారించండి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. అధిక శ్రమ వల్ల ఒత్తిడి దానివలన వెన్నునొప్పి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.
వృషభ రాశి : ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నించండి. లేకుంటే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం మెడిటేషన్ ఒక మంచి ఉపాయం. మీ కొరకు మీరు కొంత సమయం గడపండి. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయండి. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి దానివలన మీకు ఎంతో ఎనర్జీ. ఆదాయం బాగుంది వీలైతే రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టండి. వ్యాపారస్తులు కొత్త పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా లాభాలను ఆర్జిస్తారు. ఎలర్జీ వలన జలుబు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.
మిధున రాశి : ఆత్మవిశ్వాసం పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి మీకు ఎంతో ఎనర్జీ. ఆఫీసులో అదనపు బాధ్యతలు వలన అధిక శ్రమ. తోటి ఉద్యోగుల సహాయం లభిస్తుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఆదాయ వ్యవహారాలలో మీ పిల్లలు మీకు తోడు అవుతారు. కొంతమంది ఉద్యోగం మార్పుకి ప్రయత్నిస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితంలో తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.
కర్కాటక రాశి : ముఖ్యమైన నిర్ణయం తీసుకోండి. తోడబుట్టిన వారి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయ వ్యవహారాల గురించి కుటుంబ సభ్యులతో చర్చిస్తారు పెద్ద వారి సలహాలు తీసుకోండి. కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్. మీ భార్య భర్తలు గొడవ పడటం వలన మానసిక చికాకులు. ఆఫీసు పనుల్లో అధిక శ్రమ దానివలన పనులు లేట్ అయ్యే అవకాశం మరియు తప్పులు జరిగే అవకాశం. వ్యాపారస్తులు లాభాలను సంపాదించడం కోసం కొత్త ఆలోచనలు చేస్తారు ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.
సింహరాశి : అనుకున్న కార్యాలను సాధించాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఆఫీసులో పనులు సకాలంలో పూర్తి కావాలంటే అధికంగా కష్టపడవలసి వస్తుంది. వ్యాపారస్తులు రుణాలు తీసుకోవడం వాయిదా వేయండి. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు వారితో మాట్లాడటం వలన కొత్త ఆలోచనలు చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలం. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. ఫిట్ నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.
కన్యారాశి : ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నించండి లేకుంటే గందరగోళంలో పడతారు. మీ భార్య భర్తల సామరస్య ధోరణి వల్ల కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. ప్రయాణాలు ఇబ్బందికరం. పై చదువులకు విదేశాలకు వెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తున్న విద్యార్థులకు శుభవార్త. కావలసిన ప్రధానం చేతికందుతుంది పొదుపు చేస్తారు. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి. పిల్లలతో గడపడం వలన మీకు ఎంతో ఎనర్జీ. ముఖ్యంగా పెద్ద వారి సలహాలు తీసుకోండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క కేరింగ్ మిమ్మల్ని ఎంతో ఆనంద పరుస్తుంది.
తులారాశి : ఆత్మవిశ్వాసము పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నించండి లేకుంటే మీ కోపం మిమ్మల్ని రోగాల పాలు చేస్తుంది. ఆదాయ వ్యవహారాల గురించి కుటుంబ సభ్యులతో వారికి అర్థమయ్యేటట్లు చర్చించండి. ఈ రాశి స్త్రీల కి మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.
వృశ్చిక రాశి : ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోండి. వ్యాపారస్తులకు సాధారణమైన రోజు. ప్రభుత్వానికి కట్టవలసిన పన్నుల గురించి జాగ్రత్త వహించండి. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం. ఆఫీసులో పనులను పెండింగ్ పెట్టడం వలన పై అధికారులతో మాటలు. ఆదాయ వ్యవహారాలు మరింత మెరుగు పడతాయి. దుబారా ఖర్చులను నివారించండి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.
ధనుస్సు రాశి : ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. యోగ మెడిటేషన్ ఒక మంచి ఉపాయం. అనుకోని అతిథుల వలన ఖర్చులు అధికం. మీ భార్య భర్తలు గొడవలు పడటం మాని ఒకరికొకరు సహకరించుకోండి. స్థిరాస్తి అమ్మకపు వ్యవహారాలు లాభాలను తెస్తాయి. ఆఫీసు పనుల్లో తోటి ఉద్యోగుల సహాయం తీసుకోండి. కొంతమంది ఉద్యోగం మార్పుకై ప్రయత్నిస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.
మకర రాశి : కష్టే ఫలి. కష్టపడిన దానికి ప్రతిఫలం దక్కుతుంది. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి దానివలన మీకు ఎంతో ఎనర్జీ. ఆఫీసు పనుల్లో అధిక శ్రమ వలన మానసిక విచారం. వ్యాపార రీత్యా ప్రయాణాలు దీర్ఘకాలంలో ఉపయోగపడతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు సఫలం. ఆరోగ్యానికి ప్రాముఖ్యతను ఇవ్వండి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు వైవాహిక జీవితంలోని ఆనందాన్ని సంపూర్ణంగా అనుభవిస్తారు.
కుంభరాశి : కుటుంబంలోని గొడవల వలన మానసిక అశాంతి. దైవ ప్రార్థన మీకు మనోబలాన్ని ఇస్తుంది. ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వండి. ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నించండి. అనుకోని ఖర్చులు వలన డబ్బుకు ఇబ్బంది. ఆఫీసులో ముఖ్యమైన పనులను త్వరగా పూర్తి చేయండి. ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోండి అందరి మద్దతు లభిస్తుంది. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీతో తగినంత సమయం గడపటం మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
మీనరాశి : ఆత్మవిశ్వాసము పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆఫీసు పనుల్లో అదనపు బాధ్యతల వల్ల అధిక శ్రమ. కావాల్సినంత ధనం చేతికందుతుంది. ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోండి దాని వల్ల భవిష్యత్తులో లాభం. ఇతరుల గురించి చెడుగా మాట్లాడకండి ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు ఒకరికొకరు సహకరించుకోండి. దానివలన మీ వైవాహిక జీవితం ఆనందకరం.