Astrology: మార్చి 31 నుంచి ఆ రాశుల వారి జీవితం పూర్తిగా మారిపోనుంది.. మీ రాశి ఉందా..?
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, గ్రహాలు రాశి సంచారాలు చేస్తుంటాయి.

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, గ్రహాలు రాశి సంచారాలు చేస్తుంటాయి. ఇలా సంచారం చేసినప్పుడు, దీని ప్రభావం 12 రాశుల వారిపైన ప్రభావం చూపుతుంది. అయితే, శని గ్రహం చేసినప్పుడు కొన్ని రాశుల వారికీ అనుకూలంగా ఉంటే, మరికొన్ని రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. శని, మార్చి 31 న మీన రాశిలో సంచారం చేయడం వలన రెండు రాశుల వారు అనేక ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా, శని అనుగ్రహం లభించి అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..
మిథున రాశి ( mithuna rasi )
శని గ్రహం ప్రభావం వలన ఈ మిథున రాశి వారికి వ్యాపారాల్లో కలిసి వస్తుంది. అంతే కాదు, ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి. మీరు మొదలు పెట్టిన ప్రతి పనిని పూర్తి చేస్తారు. కోర్టుకి సంబంధించిన పనులు పరిష్కారమవుతాయి. ఆరోగ్య సమస్యలు నుంచి ఉపశమనం పొందుతారు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల నెరవేరుతుంది. అంతేకాకుండా.. వ్యాపారాలు మొదలు పెట్టడం వలన ఆకస్మిక లాభాలు వస్తాయి.
కర్కాటక రాశి ( karkataka rasi )
శని గ్రహం ప్రభావం వలన ఈ రాశి వారికీ శుభంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే , ఈ సమయంలో వీరికి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఫైనాన్స్ మిమ్మల్ని అనేక సమస్యల నుండి కాపాడుతుంది. డబ్బు విషయంలో కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండండి. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి. మీరు బాగా డబ్బు సంపాదిస్తే మీ వ్యక్తిగత జీవితం కూడా మెరుగుపడుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.