ఈ అమ్మాయి కళకు హ్యాట్సాఫ్.. రామ్ పరివార్ ఎంత అద్భుతంగా గీసిందో చూడండి!
16 కళలు సంపూర్ణంగా కలిగిన మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు అని మనకి తెలుసు.

దిశ, వెబ్ డెస్క్: 16 కళలు సంపూర్ణంగా కలిగిన మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు అని మనకి తెలుసు. ఇక మరి కొన్ని రోజుల్లో శ్రీరామ నవమి రాబోతుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న రామాలయాలన్నీ సర్వంగా సుందరంగా ముస్తాబవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. ఇందులో ఓ అమ్మాయి ఎంతో అద్భుతంగా రామ్ పరివార్ చిత్రాన్ని గీసింది. అంతేకాదు, ఆ అమ్మాయి ఆ చిత్రాన్ని ఎలా గీసిందో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. మరీ ఆ అమ్మాయి ఎలా గీసిందో మీరు కూడా చూసేయండి.
వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ అమ్మాయి తెల్లటి కాగితంపై రంగు రంగుల పెన్నుతో రాముడి పేరు రాస్తోంది. ఇలా 1,00,011 సార్లు రామ్ అనే అక్షరాలు రాసి.. రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడి చిత్రాలను గీసింది. ఈ డ్రాయింగ్ చూసేందుకు ఎంతో అద్భుతంగా ఉంది. ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. రాముడి పేరుతో 'రామ్ పరివార్' చిత్రాన్ని గీయటం అంద సులభం కాదంటూ అమ్మాయి ఓపికకు, శ్రమకు, సృజనాత్మకతకు నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. జై శ్రీరామ్ అంటూ ఆ అమ్మాయిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రం చూసేందుకు అద్భుతంగా ఉందని, తమ పూజ గదిలో పెట్టుకునేందుకు కావాలని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.