ఈ రాశివారికి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది
ప్రదేశము : హైదరాబాద్, ఇండియా సంవత్సరం : ప్లవనామ సంవత్సరం ఆయనం : దక్షిణాయణం మాసం : శ్రావణమాసం ఋతువు : వర్ష ఋతువు వారము : మంగళవారం పక్షం : కృష్ణ (బహుళ) పక్షం తిథి : నవమి (ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 0 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 4 గం॥ 23 ని॥ వరకు) నక్షత్రం : రోహిణి (నిన్న ఉదయం 6 గం॥ 40 ని॥ నుంచి ఈరోజు ఉదయం […]
ప్రదేశము : హైదరాబాద్, ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : శ్రావణమాసం
ఋతువు : వర్ష ఋతువు
వారము : మంగళవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : నవమి (ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 0 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 4 గం॥ 23 ని॥ వరకు)
నక్షత్రం : రోహిణి (నిన్న ఉదయం 6 గం॥ 40 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 43 ని॥ వరకు)
యోగము : హర్షణము
కరణం : తైతిల
వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 42 ని॥ నుంచి తెల్లవారుజాము 2 గం॥ 30 ని॥ వరకు)(ఈరోజు మధ్యాహ్నం 3 గం॥ 59 ని॥ నుంచి సాయంత్రం 5 గం॥ 46 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 6 గం॥ 6 ని॥ నుంచి 7 గం॥ 54 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 31 ని॥ నుంచి 9 గం॥ 21 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 10 గం॥ 36 ని॥ నుంచి 11 గం॥ 26 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మధ్యాహ్నం 3 గం॥ 23 ని॥ నుంచి సాయంత్రం 4 గం॥ 56 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 16 ని॥ నుంచి 1 గం॥ 49 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 9 గం॥ 8 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 41 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 1 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 31 ని॥ లకు
సూర్యరాశి : సింహము
చంద్రరాశి : వృషభము
మేష రాశి : మీ భార్య భర్తల సామరస్య ధోరణి వలన కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. అనుకున్న కార్యాలను సాధించాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. వ్యాపారస్తులు తమ భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించండి. ఆఫీసులో అదనపు బాధ్యతలు వలన అధిక శ్రమ. దాని వలన పనిమీద ఏకాగ్రత పెట్టలేరు. అప్పుడు ఎవరికీ ఇవ్వకండి తిరిగి రావు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.
వృషభ రాశి : అనుకున్న కార్యాలను సాధించాలంటే సహనం, పట్టుదల అవసరం. కొత్త నగలు కొంటారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. దైవప్రార్థన వలన మానసిక బలం. వ్యాపారస్తులు లాభాల కోసం మరింత కష్టపడాలి. ఆఫీసు పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి కొంతమంది ఉద్యోగం మార్పుపై ప్రయత్నాలు చేస్తారు. కావలసినంత ధనం చేతికందుతుంది. భవిష్యత్ అవసరాల కొరకు పొదుపు చేయండి. కుటుంబ సభ్యులతో పరుషంగా మాట్లాడకండి కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఈ రోజు ఒక తీపి గుర్తు.
మిధున రాశి : ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ముఖ్య నిర్ణయాలను ఆలోచించి ధైర్యంగా తీసుకోండి. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. పెద్ద వారి ఆశీర్వచనాలు లభిస్తాయి తోబుట్టువుల సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ కొరకు మరిన్ని పెట్టుబడులు పెడతారు ఆఫీసులో అదనపు బాధ్యతలు వలన అధిక శ్రమ. ఆదాయ వ్యవహారాలు మరింత మెరుగు పడతాయి. ఒత్తిడి వలన కడుపులో ఎసిడిటీ. ఖాళీ సమయాన్ని ఇంటి అలంకరణ కొరకు ఉపయోగించండి. ఈ రాశి స్త్రీ లకు మీ భర్త మీతో తగినంత సమయం గడపటం మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది
కర్కాటక రాశి : ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న కోర్టు కేసు తీర్పు మీకు అనుకూలం. ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఆఫీసులో పనులను చకచకా పూర్తి చేస్తారు. ఫిట్ నెస్ పై పూర్తి శ్రద్ధ పెట్టండి. పాత బాకీలను తీర్చడం వలన మరింత ఆర్థిక ఇబ్బంది. అనవసరపు ఖర్చులను నివారించండి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.
సింహరాశి : ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. కొత్త అవకాశాలు లభిస్తాయి. బహుమానాలు అందుకుంటారు. ఒక శుభవార్త అందుతుంది దానివలన కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. స్నేహితుల బంధువుల సహాయ సహకారాలు లభిస్తాయి. మీరు పొదుపు చేసిన డబ్బు మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఈ రాశి స్త్రీలకు మీ భార్యభర్తలకు ఈరోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.
కన్యారాశి : కొంతమందికి దూరప్రయాణాల వలన శ్రమ ఖర్చు. అధిక కోపం వలన ఒత్తిడి దాని వలన రోగం. యోగ మెడిటేషన్ ఒక మంచి ఉపాయం. ఆఫీసు పనులను శ్రద్ధతో పూర్తిచేయండి అందరి ప్రశంసలు. మీ భార్య భర్తల సామరస్య ధోరణి వలన కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. విదేశాలకు పైచదువులకు వెళ్లాలనుకునే విద్యార్థులకు శుభవార్త. ఈ రాశి స్త్రీలకు మీ భర్త తగినంత సమయం మీతో గడపటం మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
తులారాశి : ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోండి. అప్పులు ఎవరికీ ఇవ్వకండి. ఇస్తే భవిష్యత్తులో సమస్యలు రావచ్చు. ఆఫీసులో పనులలో మీ నిబద్ధత మరియు సామర్థ్యంపై అందరి ప్రశంసలు మీరు చేస్తున్న దుబారా ఖర్చులు ఇంట్లో సభ్యులకు నచ్చకపోవచ్చు. మెడిటేషన్ వలన మానసిక ఆరోగ్యం. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.
వృశ్చిక రాశి : ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారస్తులు లాభాలు కొరకు మరింత కష్టపడాలి. ప్రభుత్వ టాక్స్ వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులు రోజూ ఆఫీసుకు ఆలస్యంగా రావడం వలన ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. పనులను సకాలంలో కష్టపడి పూర్తి చేస్తారు. కొందరు ఉద్యోగులకు ప్రమోషన్. పెళ్లి కాని వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం. ఒత్తిడిని అధిగమించండి. లేకుంటే అనారోగ్యం. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క మొరటుతనం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది
ధనుస్సు రాశి : ఆశావహ దృక్పథంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆదాయ వ్యవహారాలు మెరుగు పడతాయి. కుటుంబ సభ్యులు ముఖ్యంగా పెద్ద వారి సూచనలను స్వీకరించండి. అవసరాలకు తగినంత ఖర్చు పెడతారు. ఆఫీసు పనులను ఓపిక, సహనంతో పూర్తి చేయండి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీతో తగినంత సమయం గడపటం మీకు ఎంతో ఆనందం ఇస్తుంది.
మకర రాశి : ఒత్తిడి వలన కోపం కోపం వలన ఎసిడిటి. ఎసిడిటి వలన అనారోగ్యం. ఆలోచించండి. కుటుంబంలో కలహాలు వలన మానసిక అశాంతి. పాతబాకీలు వసూలవుతాయి. ఆఫీసులో అదనపు బాధ్యతల వల్ల అధిక శ్రమ. ఫిట్నెస్ పై శ్రద్ధ పెట్టండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీకు ఒక ఆశ్చర్యకరమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. ఆనందించండి.
కుంభ రాశి : ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. స్నేహితుల సహాయం లభిస్తుంది. ఆఫీసు పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. మరింత కష్టపడండి. కావాల్సినంత ధనం చేతికందుతుంది బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. సరైన పథకాలలో పెట్టుబడులు పెట్టండి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. అధిక శ్రమ వలన మెడ నొప్పి. తగినంత విశ్రాంతి తీసుకోండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీకు ఒక ఆశ్చర్యకరమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.
మీన రాశి : సహనం పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆఫీసు పనుల్లో అధిక శ్రమ. పనులు సకాలంలో పూర్తి కావాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. ఆదాయం పర్వాలేదు కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొరకు డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది. ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించండి. అధిక శ్రమ వల్ల కాళ్ల నొప్పులు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.