ఆన్‌లైన్ ట్రేడింగ్‌తో రూ.20 లక్షలకు కుచ్చుటోపి
దిశ, క్రైమ్ బ్యూరో : ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో నగరానికి చెందిన మహిళను రూ.20 లక్షలకు మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్ విన్ బిజ్ లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు పొందవచ్చని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాచకొండకు చెందిన మహిళకు వాట్సప్ మెస్సేజ్ (హాంకాంగ్ నెంబరు నుంచి ) పంపించారు. పలుమార్లు ఫోన్ చేసి విన్ బిజ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని, అధిక లాభాలు వస్తాయంటూ […]
దిశ, క్రైమ్ బ్యూరో : ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో నగరానికి చెందిన మహిళను రూ.20 లక్షలకు మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్ విన్ బిజ్ లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు పొందవచ్చని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాచకొండకు చెందిన మహిళకు వాట్సప్ మెస్సేజ్ (హాంకాంగ్ నెంబరు నుంచి ) పంపించారు. పలుమార్లు ఫోన్ చేసి విన్ బిజ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని, అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించారు. దీంతో నమ్మిన మహిళను ముందుగా రూ.500 లతో రీచార్జ్ చేయమని చెప్పారు. ఇలా మోసగాళ్లు చెప్పిన ప్రకారంగా.. అదే యాప్ నుంచి రీచార్జ్ చేయడంతో తన ఐసీఐసీఐ బ్యాంకు నుంచి 2021 ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చి 15వ తేదీ వరకూ పలు విడతలుగా దాదాపు రూ.20 లక్షలను ఆన్ లైన్ ట్రేడింగ్ పెట్టింది.
విన్ బిజ్ యాప్ లో ఈ మొత్తం రూ.54.39 లక్షల రూపాయలుగా చూపించింది. దీంతో ఆ మొత్తాన్ని సదరు మహిళ విత్ డ్రాయల్ ఆప్షన్ బ్లాక్ అయినట్టుగా బాధితురాలు గమనించింది. దీంతో మోసపోయినట్టుగా గ్రహించిన బాధితురాలు ఈ విషయంపై రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు.. ఏప్రిల్ 9వ తేదీ బెంగుళూరు వెళ్లిన పోలీసులు నిందితులు అశోక్ కుమార్, కంచి సంజీవ్ కుమార్, అసిమ్ అక్తర్ లను అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా పోలీసులు 15 ఫేక్ కంపెనీలను గుర్తించారు. సుమారు 14 బ్యాంకు అకౌంట్ల వివరాలు, చెక్ బుక్ లను, 22 మొబైల్ ఫోన్లు, 24 స్టాంపులు, ఫేక్ రిజిస్ట్రార్డ్ కంపెనీల పత్రాలు, 3 సీపీయూలను స్వాధీనం చేసుకున్నారు. వేర్వేరు బ్యాంకులలో ఉన్న సుమారు రూ.3.5 కోట్లను ఫ్రీజ్ చేసినట్టు రాచకొండ సీపీ మహేష్ భగవత్ శనివారం తెలిపారు. క్రైమ్ డీసీపీలు యాదగిరి, డి.శ్రీనివాస్, ఏసీపీ హరినాథ్, ఇన్ స్పెక్టర్ విజయ్ కుమార్ లను సీపీ అభినందించారు.