‘దొరల గడిలో చేరిన మరో గుమస్తా’

దిశ, తెలంగాణ బ్యూరో : దొరల గడిలో మరో గుమస్తా చేరినట్లు ఉందని టీఆర్ఎస్‌లో ఎల్.రమణ చేరికను ఉద్దేశించి టీటీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనాతో రాష్ట్రంలో ఎక్కువగా నష్టపోయింది చేనేత కార్మికులన్నారు. సమస్యల పరిష్కారం కోసం 100 రోజులు నిరాహార దీక్షచేపట్టినా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిల్వ ఉన్న చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని ప్రాధేయపడినా […]

Update: 2021-07-16 09:40 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : దొరల గడిలో మరో గుమస్తా చేరినట్లు ఉందని టీఆర్ఎస్‌లో ఎల్.రమణ చేరికను ఉద్దేశించి టీటీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనాతో రాష్ట్రంలో ఎక్కువగా నష్టపోయింది చేనేత కార్మికులన్నారు. సమస్యల పరిష్కారం కోసం 100 రోజులు నిరాహార దీక్షచేపట్టినా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

నిల్వ ఉన్న చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని ప్రాధేయపడినా కనికరించలేదని, త్వరలోనే రాబోయే హుజూరాబాద్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని లబ్ధిపొందేందుకు హామీలు ఇస్తున్నారని అన్నారు. ప్రభుత్వం చేసే ప్రకటనలు, ఇచ్చే హామీలను విశ్వసించే స్థితిలో నేత కార్మికులు లేరన్నారు. టీఆర్ఎస్ పాలనలో చేనేతకు చేసింది శూన్యమన్నారు. నేతన్న సమస్యలను పరిష్కరించింది కేవలం టీడీపీయే అన్నారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడిన ఏకైక పార్టీ టీడీపీ అన్నారు.

Tags:    

Similar News