శ్రీవాణి ట్రస్ట్‌కు 10 వేలు విరాళమిస్తే బ్రేక్ దర్శనం: టీటీడీ

దిశ, ఏపీ బ్యూరో: తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. శ్రీవాణి ట్రస్ట్‌కు 10 వేల రూపాయలు విరాళంగా ఇచ్చే భక్తులకు తిరుమలలో కల్పించే బ్రేక్ దర్శనం టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు టీటీడీ ఒక ప్రకటన జారీ చేసింది. దీనికి సంబంధించి విరాళం ఇవ్వడం, టికెట్లను పొందడానికి వెబ్ సైట్, యాప్ ద్వారా సంప్రదించాలని సూచించింది. అలాగే జేఈఓ కార్యాలయం నుంచి కూడా పరిమిత సంఖ్యలో టికెట్లను జారీ చేస్తామని టీటీడీ […]

Update: 2020-06-24 01:49 GMT

దిశ, ఏపీ బ్యూరో: తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. శ్రీవాణి ట్రస్ట్‌కు 10 వేల రూపాయలు విరాళంగా ఇచ్చే భక్తులకు తిరుమలలో కల్పించే బ్రేక్ దర్శనం టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు టీటీడీ ఒక ప్రకటన జారీ చేసింది. దీనికి సంబంధించి విరాళం ఇవ్వడం, టికెట్లను పొందడానికి వెబ్ సైట్, యాప్ ద్వారా సంప్రదించాలని సూచించింది. అలాగే జేఈఓ కార్యాలయం నుంచి కూడా పరిమిత సంఖ్యలో టికెట్లను జారీ చేస్తామని టీటీడీ తెలిపింది.

Tags:    

Similar News