దర్శనాల సంఖ్య పెంచే యోచనలో టీటీడీ
దిశ, వెబ్ డెస్క్ : దర్శనాల సంఖ్యను పెంచాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 9వేల మంది భక్తులను మాత్రమే స్వామివారి దర్శనానికి టీటీడీ అనుమతిస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనుంది. కరోనా కారణంగా జులై 16 నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేసిన టీటీడీ… సెప్టెంబర్ నుంచి 20 వేల నుంచి 30వేల మందిని దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేస్తోంది. శుక్రవారం జరగబోయే పాలకమండలి సమావేశంలో దర్శనాల సంఖ్య పెంపుపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు టీటీడీ […]
దిశ, వెబ్ డెస్క్ : దర్శనాల సంఖ్యను పెంచాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 9వేల మంది భక్తులను మాత్రమే స్వామివారి దర్శనానికి టీటీడీ అనుమతిస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనుంది.
కరోనా కారణంగా జులై 16 నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేసిన టీటీడీ… సెప్టెంబర్ నుంచి 20 వేల నుంచి 30వేల మందిని దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేస్తోంది. శుక్రవారం జరగబోయే పాలకమండలి సమావేశంలో దర్శనాల సంఖ్య పెంపుపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.