టీటీడీ ఎస్ బ్యాంక్ డిపాజిట్లు వెనక్కి..
దిశ,తిరుపతి ప్రైవేట్ రంగానికి చెందిన ఎస్ బ్యాంక్.. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో.. తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్ బ్యాంకులో డిపాజిట్ చేసిన రూ.600 కోట్లను వెనక్కి తీసుకుంది. మిగిలిన ప్రైవేటు బ్యాంకులలో ఉన్న డిపాజిట్ల వ్యవహారంపై కూడా దృష్టిపెట్టింది. ఎస్ బ్యాంకు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో.. డిపాజిట్లు వెనక్కి తీసుకోవాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశించారు. ఛైర్మన్ ఆదేశానుసారం డిపాజిట్లను టీటీడీ విత్ డ్రా చేసింది. ఇకపై బ్యాంకుల […]
దిశ,తిరుపతి
ప్రైవేట్ రంగానికి చెందిన ఎస్ బ్యాంక్.. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో.. తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్ బ్యాంకులో డిపాజిట్ చేసిన రూ.600 కోట్లను వెనక్కి తీసుకుంది. మిగిలిన ప్రైవేటు బ్యాంకులలో ఉన్న డిపాజిట్ల వ్యవహారంపై కూడా దృష్టిపెట్టింది. ఎస్ బ్యాంకు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో.. డిపాజిట్లు వెనక్కి తీసుకోవాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశించారు. ఛైర్మన్ ఆదేశానుసారం డిపాజిట్లను టీటీడీ విత్ డ్రా చేసింది. ఇకపై బ్యాంకుల రేటింగ్ ఆధారంగా డిపాజిట్లు చేయాలని పాలకమండలి నిర్ణయించింది.
tags;yes bank, LTD deposit withdraw, chairman subba reddy order